కరోనా లాంటి నకిలీ వైరస్‌ సృష్టించి..

26 Jul, 2020 04:36 IST|Sakshi

కరోనా వైరస్‌కు టీకా అయితే తయారవుతోంది కానీ.. దీని గురించి శాస్త్రవేత్తలకు తెలిసింది కొంతే. పైగా ఈ వైరస్‌తో పనిచేయాలంటే చాలా ఇబ్బంది. ప్రత్యేకమైన బయో సేఫ్టీ వ్యవస్థలున్న పరిశోధనశాలలే శరణ్యం. అది కూడా పూర్తిస్థాయి హజ్మత్‌ సూట్‌ ను వేసుకునే పనిచేయాలి. శాస్త్రవేత్తల రక్షణ కోసం ఈ ఏర్పాట్లన్నీ అవసరమైనప్పటికీ వ్యాక్సిన్, టీకా త యారీల్లో జాప్యానికి ఇవి కూడా కొంత కారణం. ఇలా కాకుండా.. ఈ వైరస్‌ను అర్థం చేసుకునేందుకు ఓ సులువైన మోడల్‌ ఉంటే? అచ్చంగా ఇదే పనిచేశా రు వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు. అచ్చం కరోనా వైరస్‌ మాదిరిగానే కణాల్లోకి చొరబడటమే కాక.. యాంటీబాడీలతో చర్యలు జరిపే నకిలీ వైరస్‌ ఒకదాన్ని వీరు అభివృద్ధి చేశారు. ఒక్క తేడా ఏమిటంటే.. ఈ కృత్రిమ వైరస్‌తో ఏ రకమైన వ్యాధి రాదు. సార్స్‌ కోవ్‌–2 వైరస్‌ నుంచి వేరు చేసిన ఒక జన్యువును నిరపాయకరమైన ఓ వైరస్‌లోకి జొప్పించడం ద్వారా ఈ హైబ్రిడ్‌ వైరస్‌ తయారైంది. (వైరస్తో వాసన కోల్పోయేది ఇందుకే..)

వ్యాధి ఎలాగూ కలుగజేయదు కాబట్టి ఈ హైబ్రిడ్‌ వైరస్‌పై సాధారణ పరిశోధనశాలల్లోనూ ఎంచక్కా పరిశోధనలు చేపట్టవచ్చునని సీన్‌ వీలా న్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. సులువుగా జన్యుమార్పులు చేయగలిగే.. పరిశోధనశాలల్లో ఇప్పటి కే విస్తృతంగా వినియోగంలో ఉన్న వెసిక్యులర్‌ స్టోమటైటిస్‌ వైరస్‌.. క్లుప్తంగా వీఎస్‌వీని తాము హైబ్రిడ్‌ వైరస్‌ తయారీకి ఎంచుకున్నామని, పాడిపశువులు, గుర్రాలు, పందుల్లో ఈ వైరస్‌ ఎక్కువగా ఉంటుందని వీలాన్‌ తెలిపారు. అప్పుడప్పుడూ మనుషులకూ ఇది సోకుతుందని కానీ మూడు నుంచి ఐదు రోజు ల్లోనే తొలగిపోతుందని చెప్పారు. వీఎ స్‌వీ ఉపరితల ప్రొటీన్‌ స్థానంలో తాము కరోనా వైరస్‌ కొమ్మును ఏర్పాటు చేశామని ఫలితంగా ఏర్పడ్డ కొత్త వైరస్‌ కరోనా మాదిరిగానే వ్యవహరిస్తుందని తెలిపారు.

కోవిడ్‌–19 కారక కరోనా వైరస్‌లోని ఇత ర జన్యువులు లేని కారణంగా హైబ్రిడ్‌ వైరస్‌ ప్రమాదకారి మాత్రం కాదని స్పష్టం చేశారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించిన యాంటీబాడీలు ఈ హైబ్రిడ్‌ వైరస్‌ను గుర్తించినట్లు తమ ప్రయోగాల ద్వారా తెలిసిందని వీలాన్‌ చెప్పా రు. ఈ వైరస్‌ను అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, మెక్సికో, కెనెడాల్లోని పలు పరిశోధన సంస్థలకు సరఫరా చేశామన్నా రు. యూకే, జర్మనీకి కూడా త్వరలోనే పం పనున్నట్లు చెప్పారు. నిజానికి ఈ వీఎస్‌వీ హైబ్రిడ్‌ వైరస్‌నే కోవిడ్‌ నిరోధానికి టీకాగా వాడవచ్చునని, ఈ దిశగా కూడా తాము పరిశోధన చేస్తున్నామంటున్నారు. 

మరిన్ని వార్తలు