Viral Video: వాటే ఐడియా! స్కూటర్‌ సాయంతో నిర్మాణ పనులు

6 Dec, 2022 15:53 IST|Sakshi

మనసు పెడితే దేన్నైనా మనకు సహాయకారిగా ఉపయోగించవచ్చు. కొంచెం కామెన్‌సెన్స్‌ ఉంటే దానికి కాస్త తెలివి తోడైతే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అందుకు ఉదాహరణ ఇక్కడొక వ్యక్తి నిర్మాణ పనులకు స్కూటర్‌ని ఉపయోగిస్తున్న విధానమే నిదర్శనం. ఇలా కూడా స్కూటర్‌ని వాడేయొచ్చా అని ఆశ్చర్యం కలిగించేలా ఉపయోగించాడు.

వివరాల్లోకెళ్తే...ఇది వరకు 90లలో ఉపయోగించే స్కూటర్‌ని సిమ్మెంట్‌ బస్తాలను చేరవేసే సాధనంగా ఉపయోగించాడు ఒక వ్యక్తి . స్కూటర్‌ మోటారుకి తాడు చివర భాగాన్ని ఇంజన్‌కి జోడించడంతో..దాని సాయంతో సిమ్మెంట్‌ బస్తాలను నిర్మాణంలో ఉన్న భవనంపైకి తరలిస్తున్నారు. స్కూటర్‌ హ్యాండిల్‌ని రైజ్‌ చేయగానే బస్తా పైకెళ్లుతుంది. ఎంచక్కా మనుషుల సంఖ్య, ఖర్చు తగ్గుతుంది కూడా. పని కూడా ఎంతో సులభంగా అయిపోతుంది.

అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అంతేగాదు ఈ సరికొత్త ఆవిష్కరణను ఆనంద్‌ మహీంద్ర మెచ్చుకుంటూ ట్విట్టర్‌లో... వీటిని పవర్‌ రైళ్లు అని పిలుస్తాం. ఇంజన్‌ల శక్తిని ఉపయోగించడానికి అనేక మార్గాలు. ఈ స్కూటర్‌ మెరుగ్గా ఉంటుంది. నిశబ్దంగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఇవి సెక్‌హ్యాండ్‌లో అందుబాటులో ఉన్నాయని చెప్పారు మహీంద్ర.

(చదవండి: ఒక వ్యక్తినే పెళ్లాడిన ట్విన్‌ సిస్టర్స్‌: వీడియో వైరల్‌)

మరిన్ని వార్తలు