3 కోట్ల రేషన్‌ కార్డుల తొలగింపా.. సుప్రీం కోర్టు ఆగ్రహం

17 Mar, 2021 16:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆధార్ కార్డుతో అనుసంధానం లేదన్న కారణంగా కేంద్ర ప్ర‌భుత్వం సుమారు మూడు కోట్ల రేష‌న్ కార్డుల‌ను ర‌ద్దు చేసింది. ఈ విషయంలో కొయిలీ దేవి అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిష‌న్‌పై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ జరిపింది. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు మంజూరు చేసే రేషన్‌ కార్డులను ఒకే దఫాలో ఇంత భారీ మొత్తంలో రద్దు చేయడంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ అంశాన్ని డీల్‌ చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బాబ్డే, జ‌స్టిస్ ఏఎస్ బొప్ప‌న్న, వి సుబ్ర‌మ‌ణ్యన్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఆదేశించింది. రేష‌న్ కార్డుల‌ ర‌ద్దు అంశాన్ని చుల‌క‌న‌గా చూడ‌వ‌ద్దని, దీన్ని కేంద్ర ప్రభుత్వం సీరియ‌స్‌గా తీసుకుని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించింది. పిటిషనర్‌ కొయిలీ దేవి త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది కొలిన్ గొంజాల్వెస్ వాదించారు.    

మరిన్ని వార్తలు