ఉప్పొంగుతున్న నదిలో చిక్కుకున్న వ్యక్తి.. కాపాడిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌.. వీడియో వైరల్‌

8 Oct, 2022 10:18 IST|Sakshi

దెహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో ఉప్పొంగుతున్న  నదిలో కారుతో సహా చిక్కుకున్న ఓ వ్యక్తిని రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం సురక్షితంగా కాపాడింది.  నదిలో కారుపై ఉండి సాయం కోసం ఎదురుచూసిన అతడి కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది.

పౌడీ గర్వాల్ జిల్లా శ్రీ యంత్ర తపు ప్రాంతంలో  వరదలో ప్రయాణించినప్పుడు ఇతడి కారు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. అతను స్థానికుడే అని, క్షేమంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. నదిలో చిక్కుకున్న వ్యక్తిని ఎస్‌ఆర్‌ఎఫ్ కాపాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: చీతాల పర్యవేక్షణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

మరిన్ని వార్తలు