దాంతో ఫొటో ఏంది మమ్మీ.. భయమైతుంది ప్లీజ్‌ వెళ్లిపోదాం డాడీ..

26 Sep, 2022 19:03 IST|Sakshi

అనుకోకుండానే కొందరు వ్యక్తులు సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అవుతారు. తాజాగా సోషల్‌ మీడియాలో  ఓ ఫ్యామిలీ చెందిన వీడియో చక్కర్లు కొడుతోంది. వారితోపాటు ఓ సీల్‌ చేసిన ఫన్నీ చేష్టలు సైతం నెటిజన్లను తెగనవ్విస్తున్నాయి.

అయితే, వీడియో ప్రకారం.. ఓ థీమ్‌ పార్క్‌ ఓ ఫ్యామిలీ వెళ్లింది. ఈ క్రమంలో వాటర్‌ పార్క్‌ వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఓ జంట రెడీ అయ్యింది. ఇంతలో జంతువుల ట్రైనర్‌.. సీల్‌ను నీటిలోకి వెళ్లాలని ఆదేశించాడు. ఈ క్రమంలో ఫొటోలు దిగేందుకు వారు ఓ కుర్చీపై కూర్చుకున్నారు. తర్వాత ట్రైనర్‌.. సీల్‌ను ఫొటోలకు ఫోజులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసి ఫొటోలు తీసేందుకు వెళ్లాడు. 

ఇక, ఫొటోలు తీస్తున్న క్రమంలో సీల్‌ ఇచ్చిన స్టిల్స్‌ హైలైట్‌ అని చెప్పవచ్చు. అచ్చం మనుషులు చేసినట్టుగానే ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ సమయంలో ఫొటో తీస్తున్న వైపు చూడాలని బుడ్డోడొకి పేరెంట్స్‌ చెబుతున్నప్పటికీ.. పిల్లోడు మాత్రం సీల్‌ను చూసి భయపడినట్టు ఫేస్‌ పెట్టాడు. మమ్మీ, డాడీ.. ప్లీజ్‌ ఇంక ఫొటోలు చాలు ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అన్నట్టుగా వారి వైపు చూశాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు