సీ ప్లేన్‌కు బ్రేక్‌

30 Nov, 2020 06:14 IST|Sakshi

నెలలో మూడోసారి అంతరాయం

మెయింటెనెన్స్‌ కోసం మాల్దీవులకు

సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో ఎంతో అట్టహాసంగా అక్టోబర్‌ 31 న అహ్మదాబాద్‌–కెవాడియా మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సీ ప్లేన్‌ సేవలు నెలలోనే ఆగిపోయాయి. మెయింటెనెన్స్‌ కోసం నిర్వాహకులు సీ–ప్లేన్‌ను మాల్దీవులకు పంపించారు. అయితే నిర్వహణ, మరమ్మతులు పూర్తి చేసుకొని తిరిగి సీప్లేన్‌ సేవలు కనీసం 15 రోజుల తర్వాతే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పౌర విమానయాన విభాగం డైరెక్టర్‌ అజయ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ, సీప్లేన్‌ ఫ్లైయింగ్‌ అవర్స్‌ ముగిశాయని, ఈ పరిస్థితుల్లో విమానానికి సర్వీసింగ్‌ అవసరమని, అందుకే సీప్లేన్‌ను మాల్దీవులకు తిరిగి పంపించామని తెలిపారు.

అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ – కెవడియాలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం (స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ) మధ్య తిరిగే సీ ప్లేన్‌ సేవలు ఆగిపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. అక్టోబర్‌ 31న ప్రారంభోత్సవం జరిగిన తరువాత, నవంబర్‌ 1 నుంచి ప్రజల కోసం సీ ప్లేన్‌ సేవలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నెల రోజుల్లో ఇప్పటికే 3–3 రోజుల పాటు రెండుసార్లు ఈ సీప్లేన్‌ను అధికారులు నిలిపివేశారు. ఆ సమయంలో క్రూ మెంబర్స్‌కు విరామాన్ని ఇచ్చేందుకు సేవలు ఆపినట్లు అధికారులు తెలిపారు. 

సీ ప్లేన్‌ వివరాలు
సిట్టింగ్‌ కెపాసిటీ : 19 మంది
బరువు: 3,377 కిలోలు
వేగం: 170 కి.మీ./గంటకు
ఇంధన సామర్థ్యం: 1,419 లీటర్లు
పొడవు: 16 మీటర్లు   1 ఎత్తు: 6 మీటర్లు  
ఇంధన శక్తి: 272 లీటర్లు / గంటకు
బరువు సామర్థ్యం: 5670 కిలోలు
టికెట్‌ ధర (ఒక్కరికి): రూ.4,0005,000

సందర్శకుల సంఖ్య రోజుకు 13వేలు
అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ సందర్శకుల సంఖ్య రోజుకు 10 వేలు

మరిన్ని వార్తలు