దేశంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ రెండో మరణం నమోదు

25 Jun, 2021 14:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. ఈ మహమ్మారి రోజురోజుకి తన రూపాన్ని మార్చుకుంటూ వ్యాప్తి చేందుతుంది. అయితే, ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తొలి మరణం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా, ఇదే రాష్ట్రంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కారణంగా రెండో మరణం సంభవించిందని వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. కాగా, గడిచిన వారంలో 6 డెల్టా వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి.

మధ్య ప్రదేశ్‌ నుంచి 1,219 నమునాలను సేకరించి జీనోమ్‌ సీక్వేన్సింగ్‌ కోసం నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ డిసిజ్‌ కంట్రోల్‌(ఎన్‌సీడీసీ)కు పంపించారు. అయితే, దీనిలో 31 శాతం నమునాలు ఆందోళనకరంగా ఉన్నట్లు ఎన్‌సీడీసీ తెలిపింది. మధ్యప్రదేశ్‌లో నమోదైన 6 డెల్డా వేరియంట్‌ కేసులలో భూపాల్‌లో 2 కేసులు, ఉజ్జయినిలో 2 కేసులు, శివపూరి సమీపంలోని రైసన్‌, అశోక్‌నగర్‌ల నుంచి ఒక్కో డెల్టా వేరియంట్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మన దేశంలో ఇప్పటి వరకు, 318 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు బయట పడ్డాయి. అదే విధంగా, యూకేలోని లండన్‌లో ఆల్ఫా వైరస్‌ రకానికి చెందిన 56 కేసులు నమోదయ్యాయి.  

చదవండి: దేశంలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ తొలి మరణం నమోదు

మరిన్ని వార్తలు