సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు.. ప్రకటించిన రక్షణ శాఖ

17 Mar, 2023 16:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  సికింద్రాబాద్‌ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేస్తూ శుక్రవారం గెజిట్  విడుదల చేసింది కేంద్ర రక్షణ శాఖ. ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్‌ను కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. రక్షణ శాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. 

అయితే.. కంటోన్మెంట్ బోర్డుకు ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. కంటోన్మెంట్ ​బోర్డుల ఎన్నికలు 6 నెలలు వాయిదా వేయాలంటూ నామినేటెడ్ సభ్యులు కోరగా, రక్షణ శాఖ స్పందించి రద్దు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. అయితే.. 

మరోవైపు కంటోన్మెంట్​ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు చేపట్టిన ప్రాసెస్​కొనసాగుతుండగా, బోర్డు ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కంటోన్మెట్​వికాస్​మంచ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై 23న విచారణ జరగనుంది. 

మరిన్ని వార్తలు