సొంత వైద్యం తీసుకున్నారో.. ఇక అంతే!

2 Aug, 2020 15:58 IST|Sakshi

ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో ప్రజలు అల్లాడిపోతున్నారు. కరోనా వ్యాప్తి సంక్రమణపై ఇప్పటికే పలు నివేదికలు విడుదలయ్యాయి. తాజాగా సొంత వైద్యంతోనే కరోనా వ్యాప్తి వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఓ మీడియా చానెల్‌ చేసిన సర్వేలో వెల్లడైంది.  కరోనా వ్యాధి లక్షణాలు మొదలవ్వగానే ప్రజలు కరోనా పాజిటివ్‌  సన్నిహితులను సంప్రదించి, వారు వాడిన మందులను వాడుతున్నారు. ఇలా డాక్టర్ల సలహాలు తీసుకోకుండా మందులు వాడడం చాలా ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. సోషల్‌ మీడియాలో కొందరు కరోనా మందులను సూచిస్తున్నారు.

వ్యక్తి శరీరాన్ని డాక్టర్లు పరిశీలిస్తేనే అతనికి సరిపోయే మందులు సూచించగలరని ప్రముఖ వైరాలజిస్ట్‌ అమితాబ్‌ నందీ తెలిపారు. ఫార్మసీ సిబ్బందికి కూడా కరోనా మందులపై అవగాహన లేదని నందీ అభిప్రాయపడ్డారు. ప్రజలందరు స్వచ్చందంగా శుభ్రత పాటించాలని సూచించారు. కరోనా లక్షణాలు లేకున్నా వస్తుందేమోనని భయం ప్రజలలో ఉందని, వ్యాధి కంటే భయమే ప్రమాదమని డాక్టర్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు