ఆ తల్లి నిర్దోషి, ఇవన్ని ఆకాశరామన్న ఉత్తరాలే?!

29 Aug, 2021 07:43 IST|Sakshi

సాక్షి, చెన్నై: పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను హతమార్చి కసాయిగా ముద్ర పడి జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ తల్లికి 17 ఏళ్లకు న్యాయం దక్కింది. ఆమె నిర్ధోషిగా పేర్కొంటూ మధురై ధర్మాసనం శనివారం తీర్పు వెలువరించింది. 

తిరుచ్చి జిల్లా తత్తయాన్‌కార పేట్టైకు చెందిన సెల్వరాజ్, శకుంతల (49) దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2002 ఏడాదిన్నర చంటి బిడ్డను హతమార్చిన కసాయిగా  అందరి దృష్టిలో శకుంతల మిగిలి పోయింది. సెల్వరాజ్‌ ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, శకుంతలను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. తిరుచ్చి మహిళా జైలులో శిక్ష అనుభవిస్తూనే న్యాయ పోరాటం మీద శకుంతల దృష్టి పెట్టారు. పిటిషన్‌ విచారణ సమయంలో ఆమెకు బెయిల్‌ లభించింది. 

అయితే, 2016లో బెయిల్‌ రద్దు కావడంతో మళ్లీ జైలుకు వెళ్లక తప్పలేదు.పట్టు వదలకుండా న్యాయపోరాటం చేస్తూ వచ్చింది. ఏడాదిన్నర బిడ్డను బావిలో పడేసి హతమార్చినట్టుగా అభియోగం ఆమె మీద మోపినా, ఆధారాలన్నీ సృష్టించబడ్డట్టుగా, ఊహాజనితంగా, ఆకాశరామన్న ఉత్తరాలను తలపించే పొంతన లేనివిగా ఉన్నాయని బెంచ్‌ గుర్తించి ఆమెను నిర్దోషిగా విడుదల చేసింది. 

చదవండి: కోవాగ్జిన్‌ సింగిల్‌ డోస్‌?!: ఐసీఎంఆర్

>
మరిన్ని వార్తలు