కరోనాతో ప్రముఖ జర్నలిస్టు కన్నుమూత: అమిత్‌షా సంతాపం

30 Apr, 2021 14:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరో సీనియర్‌ జర్నలిస్టును బలితీసుకుంది. ఆజ్ తక్‌  సీనియర్‌  జర్నలిస్ట్, న్యూస్‌ యాంకర్‌  రోహిత్ సర్దానాకు ఇటీవల కోవిడ్ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆరోగ్య పరి​స్థితుల దృష్ట్యా గురువారం మెట్రో ఆసుపత్రిలో చేరారు.  చికిత్స పొందుతున్న  సమయంలో శుక్రవారం  తీవ్ర గుండెపోటు రావడంతో కన్నుమూశారు. సర్దానా అకాలమరణంపై పలువురు జర్నలిస్టు పెద్దలు, ఇతర  రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, మరో కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు  రోహిత్‌ మరణంపై  విచారం వ్యక్తం చేశారు.  ఇంకా ఢిల్లీ  ఉపముఖ్యమంత్రి మనీష​ సిసోడియా, కాంగ్రెస్ నేత  రణదీప్ సింగ్ సుర్జేవాలా రోహిత్‌ మరణం షాక్‌కు గురిచేసిందంటూ ట్వీట్‌ చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కరోనా మహమ్మారి తన సన్నిహితుడిని బలి తీసుకుంటుదని ఊహించలేదంటూ జీ న్యూస్‌కు చెందిన సుధీర్ చౌదరి సంతాపం తెలిపారు. రోహిత్ మరణం జర్నలిస్టు లోకానికి తీరని నష్టమని మరో సీనియర్‌ జర్నలిస్ట్ భూపేంద్ర చౌబే వ్యాఖ్యానించారు. స్వయంగా ఆయన కోవిడ్‌తో బాధ పడుతున్నప్పటికీ ఇతరులకు సహాయం చేయడంలో  ఏ మాత్రం వెనుకాడలేదని తోటి జర్నలిస్టులు గుర్తు చేసుకున్నారు. 

కాగా 2000 జీ న్యూస్‌తో కరియర్‌ను ఆరంభించిన సర్దానా ఆ తరువాత సర్దానా 2017లో ఆజ్ తక్‌లో చేరారు.  జీ న్యూస్‌లో 'తాల్ తోక్ కే' , ఆజ్ తక్‌లో "దంగల్" అనే చర్చా కార్యక్రమాలతో ఆయన బాగా పాపులర్‌ అయ్యారు. 2018 లో గణేష్ విద్యార్తి పురస్కార్ అవార్డు గెల్చుకున్నారు. టీవీ న్యూస్ జర్నలిజంలో అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో రోహిత్‌ ఒకరు. (రెమిడెసివర్‌ కొరత: కేంద్రం కీలక నిర్ణయం)

మరిన్ని వార్తలు