న్యాయ విచారణలో హుక్కా సేవిస్తూ..

13 Aug, 2020 17:07 IST|Sakshi

జైపూర్‌: న్యాయస్థానాల్లో ఎంతో మర్యాదగా మెలగాలి. ఎంత పెద్ద నాయకుడైనా, సెలబ్రిటీ అయినా సరే కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. అసలు కోర్టు హాల్‌లో సెల్‌ఫోన్‌ కూడా మోగకూడదు. అంత క్రమశిక్షణగా ఉండాలి. ఇక లాయర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఓ సీనియర్‌ న్యాయవాది ప్రవర్తన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కారణం ఏంటంటే ఓ కేసు విచారణ జరుగుతుండగా.. సదరు లాయర్‌ తాపీగా హుక్కా పీల్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అతడి మీద ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు.. రాజస్తాన్‌ రాజకీయాలకు సంబంధించిన ఓ ముఖ్యమైన కేసును ఆ రాష్ట్ర‌ హైకోర్టు గురువారం ఆన్‌లైన్‌లో విచారణ జరిపింది. ఈ సమయంలో సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్‌  హుక్కా(సిగరెట్‌ లాంటి) సేవించారు. ఇది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

రాజస్తాన్‌లో బీఎస్పీ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కోర్టులో కేసు దాఖలైంది. ఈ రోజు కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ఈ సమయంలో సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్‌  హుక్కా పీలుస్తూ కనిపించారు. కాగితాలు అడ్డం పెట్టుకుని మరి ఈ పని హుక్కా పీల్చారు. విచారణలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున కపిల్‌ సిబాల్‌ వాదించారు. కాగా అశోక్‌ గహ్లోత్‌ సారథ్యంలోని రాజస్తాన్‌ సర్కార్‌పై యువనేత సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకమాండ్‌తో చర్చల అనంతరం ఆయన‌ తిరిగి సొంతగూటికి చేరారు. చదవండి: పైలట్‌ తొందరపడ్డారా!? 

మరిన్ని వార్తలు