‘అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు

15 Oct, 2021 13:17 IST|Sakshi

గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో 101వ స్థానానికి పడిపోయిన భారత్‌

న్యూఢిల్లీ: గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 116 దేశాలు జాబితాలో భారత్‌ 101వ స్థానంకు పడిపోయింది. గతేడాది పాకిస్తాన్‌తో సహా ఇతర పొరుగు దేశాల కంటే మెరుగ్గా  భారత్‌ 94వ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్ష పార్టీ నేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబాల్‌.. ప్రధాని నరేంద్ర మోదీ పై ధ్వజమెత్తారు. పేదరికం, ఆకలి నిర్మూలన కంటే కూడా భారతదేశాన్ని గొప్ప ప్రపంచ శక్తిగా మార్చే పనిలోనే ఉన్నారంటూ ఎద్దేవా చేశారు.

(చదవండి: "నా స్టార్ట్‌ప్‌ బిజినెస్‌కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్‌")

'అభినందనలు మోదీజీ' భారత్‌ దేశం చాలా గొప్ప స్థాయిలో ఉందంటూ మోదీ పై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఈ మేరకు భారత్‌  గ్లోబల్‌ ​ హంగర్ ఇండెక్స్‌ స్కోరు కూడా పడిపోయినట్లు నివేదిక తెలిపింది. ఈ క్రమంలో నేపాల్ (76), బంగ్లాదేశ్ (76), మయన్మార్ (71) పాకిస్తాన్ (92) స్థానాల్లో ముందంజలో ఉన్నప్పటికీ ఆయా దేశాలు ఆందోళనకర స్థాయిలో ఆకలి ఉన్నట్లు వెల్లడించింది. అయితే భారత్‌ కోవిడ్‌ -19 దృష్ట్య తీసుకున్న కఠిన ఆంక్షల ఫలితంగా పిల్లల మరణాల రేటు తగ్గడమే కాక పోషకాహార లోపాన్ని కూడా మెరుగుపర్చిందని నివేదిక పేర్కొంది. 

(చదవండి: ‘పీపీఈ’ డ్యాన్స్‌ చూశారా.. భలే ఉందే!)

మరిన్ని వార్తలు