టీకా వల్లే నా కూతురు చనిపోయింది..వెయ్యి కోట్లివ్వండి..

3 Sep, 2022 10:08 IST|Sakshi

బాంబే హైకోర్టులో మెడికో తండ్రి పిటిషన్‌ 

ముంబై: ‘‘కోవిషీల్డ్‌ టీకా సైడ్‌ ఎఫెక్ట్స్‌ వల్లే నా కుమార్తె మరణించింది. కేంద్ర ప్రభుత్వ కమిటీ కూడా దీన్ని ధ్రువీకరించింది. కనుక రూ.వెయ్యి కోట్ల పరిహారం ఇప్పించండి’’ అంటూ నాసిక్‌కు చెందిన స్నేహాల్‌ అనే వైద్య విద్యార్థి తండ్రి లునావత్‌ దిలీప్‌ బాంబే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతోపాటు, టీకా తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్‌కు, దానికి తోడ్పాటు అందించిన బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. వచ్చే విచారణ నాటికి సమాధానమివ్వాలని ఆదేశించింది. 
చదవండి: జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..!

మరిన్ని వార్తలు