సీరం ఆధ్వర్యంలో నోవావాక్స్ క్లినికల్ ట్రయల్స్

17 Sep, 2020 11:13 IST|Sakshi

ఏటా 2 బిలియన్ మోతాదులు తయారు : నోవావాక్స్

అక్టోబరులో సీరం నోవావాక్స్  పరీక్షలు

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. మరోవైపు కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు దిగ్గజ సంస్థలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పుణేకు చెందిన అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరో కోవిడ్-19 వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన నోవావాక్స్ వ్యాక్సిన్ ప్రయోగాలను సీరం త్వరలోనే చేపట్టనుంది. ఆగస్టులో చేసుకున్నఒప్పందం ప్రకరం, తమ వ్యాక్సిన్ ఎన్‌వీఎక్స్-కోవి 2373 యాంటిజెన్ భాగాన్ని తయారు చేయనుంది. దీంతోపాటు వచ్చే నెలలోనే (అక్టోబర్) ప్రయోగాలకు సన్నద్ధమవుతోంది.  ('స్పుత్నిక్ వి' వ్యాక్సిన్ : డా.రెడ్డీస్ భారీ డీల్)

తాజా నివేదికల ప్రకారం ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న అదార్ పూనవల్లా నేతృత్వంలోని  సీరం త్వరలోనే  నోవావాక్స్  ప్రయోగాలను ప్రారంభించనుంది. నోవావాక్స్-సీరం ట్రయల్స్‌కు పూణేలోని ఐసీఎంఆర్-నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నాయకత్వం వహించనుంది. కోవిడ్ వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని ఏటా 2 బిలియన్ మోతాదులకు రెట్టింపు చేయాలని యోచిస్తున్నా మనీ,  ప్రపంచవ్యాప్త పంపిణీకి తాము కట్టుబడి ఉన్నామని నోవావాక్స్ అధ్యక్షుడు స్టాన్లీ సి ఎర్క్ అన్నారు. దీనికి వివిధ ఫార్మా సంస్థలు, ప్రపంచ సరఫరా గొలుసులతో ఒప్పొందాలు చేసుకున్నట్టు చెప్పారు. క్లినికల్ ట్రయల్స్  2 వ దశలో ఉన్న వ్యాక్సిన్‌ను అభివృద్ధికి  చాలా  వేగంతో పనిచేస్తున్నామనీ,  రాబోయే వారాల్లో ప్రపంచవ్యాప్తంగా ఫేజ్ 3 ఎఫిషియసీ ట్రయల్స్ ప్రారంభించాలని  భావిస్తున్నామని ఎర్క్ చెప్పారు.  (కరోనా : షరతులతో సీరంకు గ్రీన్ సిగ్నల్ )

మరిన్ని వార్తలు