vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు

3 Jun, 2021 12:46 IST|Sakshi

విదేశీ టీకాలకు లైన్‌ క్లియర్‌పై సీరం అలక

అందరికీ ఒకే విధంగా ఉండాలంటున్న  సీరం

నష్టపరిహారం విషయంలో  మినహాయింపులు 

సాక్షి, న్యూఢిల్లీ: డిసెంబర్​ చివరి నాటికి అందరికీ కరోనా వ్యాక్సిన్లు వేయాలన్న లక్ష్యంలో భాగంగా విదేశీ వ్యాక్సిన్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కోవిషీల్డ్ టీకా తయారీదారు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)స్పందించింది.  వ్యాక్సిన్‌ తయారీదారులందరికీ ఒకే  సూత్రాలు వర్తింప చేయాలని అదర్ పూనావాలా కేంద్రాన్ని కోరారు.  నష్టపరిహారం విషయంలో  విదేశీ సంస్థలు రక్షణ పొందితే సీరం మాత్రమే కాదు, అన్ని దేశీయ టీకా కంపెనీలకు దీనిని వర్తింపజేయాలఅని సీరం వర్గాలు పేర్కొన్నట్టు తెలుస్తోంది. 

ఇండెమ్నిటీ బాండ్‌
ఇండెమ్నిటీ బాండ్​ అనేది సెక్యూరిటీ బాండ్‌ లాంటిదే. వ్యాక్సిన్​  ట్రయల్స్‌ సందర్భంగా ఏదైనా జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని, న్యాయపరమైన సమస్యలు రాకుండా చూసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ హామీతో ఇండెమ్నిటీ బాండ్​ ఇవ్వాలని మోడెర్నా, ఫైజర్ వంటి విదేశీ టీకా సంస్థలు  కోరుతున్నాయి. కాగా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసే క్రమంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు  వేస్తోంది. అందులో భాగంగానే విదేశాల్లో ఇప్పటికే అనుమతి పొందిన వ్యాక్సిన్లను మన దేశంలో వాడేందుకు బ్రిడ్జి ట్రయల్స్​ అ‍క్కర లేదంటూ విదేశీ టీకాలకు లైన్​ క్లియర్‌ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇండెమ్నిటీ బాండ్​, పరిహారాన్ని కూడా తామే చెల్లించే అవకాశాలను  కూడా ప్రకటించింది.  

చదవండి: Vaccination: ఊరట, త్వరలో మరో స్వదేశీ వ్యాక్సిన్‌ 
Vaccination : గుడ్‌న్యూస్‌ చెప్పిన డీసీజీఐ

మరిన్ని వార్తలు