కరోనా వ్యాక్సిన్‌ : కోవిషీల్డ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

1 Jan, 2021 17:41 IST|Sakshi

 కొత్త సంవత్సరంలో గుడ్‌ న్యూస్‌

భారత్‌లో కోవిషీల్డ్‌ టీకాకు గ్రీన్‌  సిగ్నల్‌

సీరమ్‌ కలిసి డెవలప్‌  చేస్తున​ అక్స్‌ఫర్డ్‌, ఆస్ట్రాజెనెకా  కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు అనుమతి

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నివారణకు సంబంధించి కొత్త ఏడాదిలో ప్రజలకు శుభవార్త అందింది. తాజాగా సీరం అభివృద్ధి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. దేశంలో అత్యవసర వినియోగానికి కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌కు వ్యాక్సిన్‌ నిపుణుల కమిటీ శుక్రవారం అనుమతి నిచ్చింది.  పంపిణీకి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) నుంచి త్వరలోనే అనుమతి వచ్చే అవకాశం ఉందిని భావిస్తున్నారు. (గుబులు రేపుతున్న కొత్త కరోనా, ఎన్ని కేసులంటే)

దేశంలో పంపిణీకిగాను దేశీయ అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారు సీరమ్‌ 30 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను సిద్ధం చేస్తోంది. భారత్‌లో 10 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను వినియోగించను న్నామని సీరం ఇప్పటికే  ప్రకటించింది.మరో పక్క దేశంలో యూకేకు చెందిన కొత్త కరోనా వేరియంట్‌ స్ట్రెయిన్‌ ఉనికి ఆందోళన రేపుతోంది. తాజాగా నాలుగు కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో  కొత్త  వైరస్ ‌బాధితుల సంఖ్య 29కి చేరింది. అటు కొత్త వేరియంట్‌ను కూడా ఎదుర్కొనే  సామర్ధ్యం తమ టీకాకు ఉందని ఆస్ట్రాజెనెకా  ప్రకటించింది.

మరిన్ని వార్తలు