పట్టాలు తప్పిన ముంబై-జోధ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ 8 బోగీలు

2 Jan, 2023 08:19 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సూర్యనగరి ఎక్స్‌ప్రెస్‌ రైలు 8 స్లీపర్‌ క్లాస్‌ బోగీలు పట్టాలు తప్పాయి. జోధ్‌పూర్‌ డివిజన్‌ రాజ్‌కియవాస్‌-బొమద్రా సెక్షన్‌ పరిధిలోని పాలీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 3.27 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు ముంబై నుంచి జోధ్‌పుర్‌కు వెళ్తున్న క్రమంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది వాయవ్య రైల్వే. యాక్సిడెంట్‌ రిలీఫ్‌ ట్రైన్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు పేర్కొంది. 

‘సంఘటనా స్థలానికి ఉన్నతాధికారులు వెళ్తున్నారు. వాయవ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌, ఇతర ఉన్నతాధికారులు జైపూర్‌లోని కంట్రోల్‌ రూమ్‌ ద్వారా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.’అని తెలిపారు చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ వెల్లడించారు.సంఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. పలు రైళ్లను దారి మళ్లించారు. ఈ క్రమంలోనే హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేసింది వాయవ్య రైల్వే. 

జోధ్‌పుర్‌
0291- 2654979(1072)
0291- 2654993(1072)
0291- 2624125
0291- 2431646

పాలి మర్వార్‌
0293- 2250324
138
1072

ఇదీ చదవండి: కశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ముగ్గురు పౌరులు మృతి

మరిన్ని వార్తలు