Bihar: బిహార్‌లో రాజుకున్న భూవివాదం.. ఐదుగురి మహిళలపై కాల్పులు

24 Dec, 2022 19:17 IST|Sakshi

బిహార్‌లో ఒక్కసారిగా కాల్పుల కలకలం చోటు చేసుకుంది. భూమి పట్టా పొందిన ఐదుగురు మహిళపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జీఎంసీహెచ్‌​ ఆస్పత్రి తరలించారు. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...బిహార్‌లో బెట్టియాలోని జగదీష్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. భూ యజమానులు, భూమిని పొందిన పట్టాదారులు మధ్య చెలరేగిన వివాదంగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ భూ వివాదం 1985 నాటిది. ఈ ఐదుగురు మహిళలు ల్యాండ్‌ సీలింగ్‌ చట్టం ప్రకారం భూ పట్టాలు పొందారు. ఐతే పూర్వపు భూ యజమానులు భూమిపై తమ హక్కును తొలగించడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి నిందితులు మహిళలను భూమిపై హక్కును కోల్పోయేలా పలుమార్లు ఒత్తిడి చేశారు. కానీ మహిళలు అందుకు ససేమిరా అంటూ నిరసన తెలిపారు. దీంతో దుండగులు వారిపై కాల్పులు జరిపారు.

ఈ మేరకు బెట్టియా ఎస్పీ ఉపేంద్రనాథ్‌ వర్మ మాట్లాడుతూ...ఇది పాత వివాదం అని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన ఏడుగురిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. వాస్తవానికి ల్యాండ్‌ ​సీలింగ్‌ చట్టం ప్రకారం ఒక వ్యక్తి భూమి గరిష్ట విస్తీర్ణ పరిమితి కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నట్లయితే దానిని ప్రభుత్వ లాక్కుంటుంది. 

(చదవండి: డిగ్రీ, పీజీ ప్రెగ్నెంట్‌ విద్యార్థులకు ప్రసూతి సెలవులు మంజూరు)

మరిన్ని వార్తలు