ఇది కంగనాకు అనవసర ప్రచారం: పవార్‌

9 Sep, 2020 16:35 IST|Sakshi

ముంబై: ముంబైలోని కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) కూల్చివేత చర్య ఆమెకు అనవసరమైన ప్రచారాన్ని ఇచ్చిందని నేష‌న‌ల్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో మీడియా కవరేజీపై తనకు అభ్యంతరం ఉందన్నారు. అనవసరమైన విషయాన్ని మీడియా పెద్దది చేసి చూపించిందని, ఇలాంటి వాటిని విస్మరించాలని ఆయన ఓ ఇంగ్లీష్‌ ఛానల్‌తో పేర్కొన్నారు. బృహన్‌ ముంబై మున్నిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) నిబంధనల ప్రకారమే నటి భవనాన్ని కూల్చివేసిందన్నారు. అయితే ఇది ప్రజల్లోకి తప్పుడు సందేశంగా వెళ్లిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేగాక ముంబైలో అక్రమ కట్టడాలు కొత్త విషయం కాదని, కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో నటి కార్యాలయం కూల్చివేత పలు సందేహలకు దారి తీసిందని పవార్‌ పేర్కొన్నారు. (చదవండి: కంగనా బంగ్లాను కూల్చివేసిన బీఎంసీ)

అయితే కంగనాకు, శివసేనకు మధ్య జరుగుతున్న మాటల యుధ్దంలో భాగంగా ఆమె భవనం కూల్చివేసినట్లుగా ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. అంతేగాక దీనిపై బీఎంసీ కంగనాకు తగినంత సమయం ఇచ్చిందా లేదనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. కంగనా ముంబైలో నెలల తరబడి ఉంటుందని, ఇంతకు ముందు ఎందుకు ఈ చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలను ప్రతిఒక్కరిలో వెలువడుత్నన్నాయి. దీంతో శివసేనకు కంగనా మధ్య నెలకొన్న వివాదంలో భాగంగానే ఆమె కార్యాలయాన్ని కూల్చివేశారంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇవాళ ఉదయం బాద్రాలోని కంగనా కార్యాలయాన్ని బీఎంసీ కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే ఇది అక్రమ నిర్మాణంలో భాగమని అందువల్లే కూల్చివేస్తున్నట్లు బీఎంసీ వెల్లడించింది. దీనిపై ఆమె ముంబై హైకోర్టుకు వెళ్లగా, కూల్చివేతపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. (చదవండి: ముంబైలో అడుగుపెట్టిన కంగనా)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా