వ్యాక్సిన్‌ వేసుకున్నారా? ఇలా చేస్తే 5 వేలు మీ సొంతం!

21 May, 2021 18:49 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్‌ వ్యాక్సినేషన్ క్యాంపైన్ నిర్వహిస్తోంది. 18 ఏళ్లు నిండిన వాళ్లకి దేశవ్యాప్తంగా  వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్లేందుకు భారత ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమాని​కి శ్రీకారం చుట్టింది. వ్యాక్సిన్‌ వేసుకున్న వారికి ఇంట్లో ఉండే 5000 రూపాయలు గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. 

అసలు ఏం చేయాలి..
సెలబ్రిటీలు వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు తీసిన వాళ్ల ఫోటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ ప్రజల్లో వ్యాక్సినేషన్‌ పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం మనం కూడా ఇలానే వ్యాక్సిన్‌ వేసుకునేటప్పుడు ఫోటో తీసుకోని ప్రభుత్వం తెలిపిన వెబ్‌సైట్‌లో మన ఫోటోను షేర్‌ చేయాలి. మన ఫోటోతో పాటు ట్యాగ్ లైన్ కూడా రాసి పంపిస్తే చాలు. ఆ ట్యాగ్‌ కూడా వ్యాక్సిన్‌ ప్రయోజనాలు, వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సంబంధించి ప్రజలను ఇన్‌స్పైర్‌ చేసేలా ఉండాలి. ఇలా వచ్చిన ఫోటోలలో ప్రతీ నెల 10 మందిని ప్రభుత్వం ఎంపిక చేసి వారికి అక్షరాల ఐదు వేల రూపాయలు క్యాష్ ప్రైజ్‌ను అందివ్వనున్నారు.

ఎలా చేయాలి..
మీరు ముందుగా myGov.in పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ అయ్యి ట్యాబ్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసించుకోవాలి. అనంతరం మీ వివరాలని అందులో పేర్కొనాల్సి ఉంటుంది. తర్వాత మీరు వ్యాక్సిన్‌ వేసుకునేటప్పటి ఫోటోతో పాటు టాగ్‌ లైన్‌ని జత చేసి పంపితే చాలు.

చదవండి: వైరల్‌: ఓం కరోనా ఫట్‌,ఫట్‌,ఫట్‌ స్వాహా!..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు