సంసద్‌ టీవీ హోస్ట్‌లుగా శశిథరూర్, ప్రియాంక

17 Sep, 2021 06:32 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజకీయ రంగంలో వాళ్లిద్దరికీ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అభిప్రాయాలను చెప్పడంలో, ప్రత్యర్థుల్ని ఇరకాటంలో పెట్టేలా సమాధానం ఇవ్వడంలోనూ వారికి వారే సాటి. అయితే ఇప్పుడు వారు తమ స్థానాన్ని మార్చుకొని ప్రశ్నించే స్థానంలోకి వస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభల టీవీలను కలిపేస్తూ కొత్తగా వచి్చన సంసద్‌ టీవీలో ప్రతిపక్ష ఎంపీలు శశిథరూర్, ప్రియాంక చతుర్వేది యాంకర్లుగా దర్శనమివ్వబోతున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ ‘టు ది పాయింట్‌’ అనే కార్యక్రమాన్ని హోస్ట్‌ చేయబోతుండగా, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ‘మేరి కహానీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. థరూర్‌ నిర్వహించే కార్యక్రమంలో ప్రముఖులతో వివిధ అంశాలపై లోతైన చర్చలు  ఉంటే, చతుర్వేది మహిళా ఎంపీల రాజకీయ ప్రయాణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.

మరిన్ని వార్తలు