ఇక ఆ పనిచేయలేను.. అందుకే తప్పుకుంటున్నా: శశిథరూర్‌

6 Dec, 2021 19:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్లపై రగడ కొసాగుతోంది. ఎంపీల సస్పెన్షన్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విపక్షాలు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, లోక్‌సభ ఎంపీ శశిథరూర్‌ ఎంపీలకు మద్దతుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్‌కు సంబంధించిన సంసద్‌ టీవీ హోస్ట్‌గా తప్పుకున్నారు. 

సంసద్‌ టీవీలో శశిథరూర్‌ ‘టు ది పాయింట్‌’ అనే ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్షన్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. హోస్ట్‌  తాను తప్పుకుంటున్నట్లు సంసద్‌ టీవీ సీఈఓకు లేఖ రాశారు. ఈ నె 29న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. తొలిరోజే రాజ్యసభలో 12 మంది ఎంపీలను ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సస్పెండ్‌ చేశారు. 
(చదవండి: భార్యాభర్తల గొడవ.. కూతురిని ఒంటరిగా తీసుకెళ్లి..)

గత వర్షాకాల సమావేశాల్లో సభలో వారి ప్రవర్తన సరిగాలేదంటూ వెంకయ్య వారిపై సస్పెన్షన్‌ వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రతిరోజు ఉదయం సస్పెన్షన్లను నిరసిస్తూ ఉద్యమం చేసే వాళ్లకు సంఘీభావం తెలిపి.. తర్వాత అదే పార్లమెంట్‌కు సంబంధించిన షోకు హోస్ట్‌గా వ్యవహరించడం తన వల్ల కావట్లేదని శశిథరూర్‌ తను రాసిన లేఖలో పేర్కొన్నారు.

అయితే ఆయన లేఖపై సంసద్‌ టీవీ సీఈఓ స్పందించలేదు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా శశిథరూర్‌ బాటలోనే నడిచారు. సంసద్‌ టీవీ హోస్ట్‌గా ఆమె తప్పుకున్నారు. ఆమె ‘టీవీ మేరీ కహానీ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. ఎంతో బాధ, బాధ్యతతో తాను హోస్ట్‌ తప్పుకుంటున్నట్లు ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.
(చదవండి: Amit Shah-Nagaland Incident: నాగాలాండ్‌ కాల్పులపై అమిత్‌ షా ప్రకటన)

>
మరిన్ని వార్తలు