‘లాక్‌డౌన్‌ పొడిగించినా కరోనా వ్యాప్తి తగ్గలేదు’

28 Jul, 2020 09:37 IST|Sakshi

తిరువనంతరపురం: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతు​న్నాయి. ఈ నేపథ్యంలో కేరళ రాజధాని తిరువనంతపురంలో లాక్‌డౌన్‌ పొడగించినప్పటకీ కరోనా వ్యాప్తి తగ్గలేదని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. ఈ క్రమంలో ప్రజలు తమ పనులు చేసుకోవడానికి అనుమతించాలన్నారు. తిరువనంతపురంలో కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించడం కోసం కేరళ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగించిన విషయం తెలిసిందే. ‘తిరువనంతపురంలో పొడిగించిన లాక్‌డౌన్‌పై కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్‌ మెహతాతో మాట్లాడాను. మూడు వారాలపాటు లాక్‌డౌన్‌ పొడగించడం వల్ల కరోనా వ్యాప్తిలో ఎలాంటి తగ్గుదల కనిపించలేదు. దీంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసి తిరిగి ప్రజల కార్యకలాపాలకు అనుమంతించాలి’ అని శశిథరూర్‌ ట్విటర్‌లో ‌అన్నారు. (14 లక్షలు దాటేశాయ్‌..!)

లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించే విషయమై ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం తెలిపారు. లాక్‌డౌన్‌పై ఆ కమిటీ పరిశీలిస్తోందన్నారు. తీవ్రమైన పరిస్థితుల కారణంగా తిరువనంతపురంలో లాక్‌డౌన్‌ విధించామన్నారు. సీఎస్‌ నేతృత్వంలోని కమిటీ లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు, సడలింపులను పరిశీలిస్తోందన్నారు. ఇప్పటివరకు కేరళలో 19727 కరోనా వైరస్‌ కేసలు నమోదు కాగా, 63 మంది మృతి చెందారు. 

మరిన్ని వార్తలు