అమిత్‌ షా ఆ ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదు

3 Aug, 2020 14:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయిన కేంద్రం హోంమంత్రి అమిత్‌ షా  చికిత్స కోసం ఏయిమ్స్‌ ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలకు ప్రజల విశ్వాసాన్ని ప్రేరేపించాలంటే శక్తి వంతుల(ప్రజా ప్రతినిధులు) ప్రోత్సాహకం చాలా అవసరమని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఏయిమ్స్‌) ఆస్పత్రి చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మన హోంమంత్రి అనారోగ్యానికి గురైనప్పుడు ఢిల్లీలోని ఏయిమ్స్‌కు వెళ్లకుండా, పక్క రాష్ట్రంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లాలని ఎందకు నిర్ణయించుకున్నారో ఆలోచించండి. ప్రజల విశ్వాసాన్ని ప్రేరేపించాలంటే ప్రభుత్వ సంస్థలకు శక్తివంతుల(ప్రజా ప్రతినిధుల) ప్రోత్సాహం అవసరం’అని శశి థరూర్‌ ట్వీట్‌ చేశారు. (చదవండి : ప్రముఖులపై కరోనా పంజా)

కాగా, తనలో కరోనా వైరస్‌ ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(55) ఆదివారం ట్విట్టర్‌లో పేర్కొన్న విషయం తెలిసందే. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. అలాగే కర్ణాటక, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రలు  బీఎస్‌ యెడియూరప్ప, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ కూడా కరోనా బారిన పడ్డారు. వారిద్దరూ బెంగళూరు, భోపాల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

మరిన్ని వార్తలు