Shashi Tharoor Manifesto: మ్యానిఫెస్టో తెచ్చిన తంటా... వివాదంలో శశి థరూర్‌

30 Sep, 2022 17:25 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎన్నికలకు సంబంధించిన ఒక మ్యానిఫెస్టోని విడుదల చేశారు. ఇది ఇప్పుడు ఆయనకు లేనిపోని ఇబ్బందులోకి నెట్టింది. ఈ మేరకు ఆయన తన మ్యానిఫెస్టో బుక్‌లెట్‌లో 'థింక్‌ టుమారో, థింక్‌ థరూర్‌' అనే ట్యాగ్‌ లైన్‌తో భారతదేశం అంతటా ఉన్న కాంగ్రెస్‌ యూనిట్లు సూచించే చుక్కల నెట్‌వర్క్‌తో కూడిన మ్యాప్‌ను ఉపయోగించారు.

ఐతే ఈ మ్యాప్‌ భారతదేశ అధికారిక మ్యాప్‌కి భిన్నంగా ఉంటుంది. అందులో జమ్ము కాశ్మీర్‌, లడఖ్‌ వంటి ప్రాంతాలు లేని భారత్‌ మ్యాప్‌గా రూపొందించారు. దీంతో ఈ మ్యానిఫెస్టో కాస్త సామాజిక మాధ్యమాల్లో పెద్ద వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు ఇది వికేంద్రికరణ, విభజన అంటూ ఫైర్‌ అయ్యారు. గత మూడేళ్లలో ఆయన ఇలాంటి వివాదాస్పద  వివాదంలో చిక్కుకోవడం ఇది రెండోసారి. డిసెంబర్‌ 2019లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కి వ్యతిరేకంగా కేరళ కాంగ్రెస్‌ నిరసనను ప్రచారం చేస్తూ సోషల్‌ మీడియాలో ట్విట్‌ చేసి ఇలానే వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ నాయకుడు సంబిత్‌ వంటి నేతలు విమర్శలు లేవనెత్తడంతో వెంటనే ఆ ట్విట్‌ని తొలగించారు. 

(చదవండి: కాంగ్రెస్‌ డీఎన్‌ఏలో గాంధీలు ఒక భాగం మాత్రమే.. కానీ’.. శశిథరూర్‌ సంచలన వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు