అసోంకు మారిన ‘మహా’ రాజకీయం.. ఖుషీలో కమలం నేతలు!

22 Jun, 2022 07:33 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కిం‍ది. బీజేపీ ‘ఆపరేషన్‌ కమలం’ దెబ్బకు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని పాలక సంకీర్ణం సంక్షోభంలో పడింది. శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్‌నాథ్‌ షిండే (58) తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రే వారందరినీ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన బీజేపీ పాలిత గుజరాత్‌లోని సూరత్‌లో ఓ హోటల్‌కు తరలించారు.

కాగా, బుధవారం ఉదయానికి వీరంతా బీజేపీ పాలిత అసోంకు చేరుకున్నారు. గుహవటిలో విమానాశ్రయంలో ఏక్‌నాథ్‌ షిండే మీడియాతో మాట్లాడుతూ.. తనతో శివసేనకు చెందిన 40 మంది(33 మంది శివసేన ఎమ్మెల్యే, 7 స్వతంత్రులు) ఎమ్మెల్యే ఉన్నారని అన్నారు. తామంతా బాలా సాహెబ్‌ హిందుత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తాము అని అన్నారు. ఈ సందర్భంగా వారిని రిసీవ్‌ చేసుకునేందుకు వచ్చిన అసోం బీజేపీ ఎమ్మెల్యే సుశాంత బోర్గోవైన్‌ విమానాశ్రయానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎంత మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చారో తెలియదు. వారంతా కేవలం వ్యక్తిగత కారణాల వల్లే ఇక్కడికి వచ్చారని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా.. నేడు(బుధవారం) మహారాష్ట్ర కేబినెట్‌ సమావేశం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు కేబినెట్‌ సమావేశం జరుగనుంది. భవిష్యత్‌ కార్యాచరణపై కీలక జరిగే అవకాశం ఉంది. 

ఇది కూడా చదవండి: మళ్లీ ఆపరేషన్‌ కమలం... ‘మహా’ సంక్షోభం

మరిన్ని వార్తలు