ఫ్యామిలీతో ఫారిన్‌ ట్రిప్‌.. ఎమ్మెల్యే హఠాన్మరణం!

12 May, 2022 14:17 IST|Sakshi

ముంబై: కుటుంబంతో సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ ఎమ్మెల్యే.. దుబాయ్‌లో హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో అక్కడే ఆయన కన్నుమూశారు. మృతి చెందిన ఎమ్మెల్యేను మహారాష్ట్ర శివసేన ఎమ్మెల్యే రమేష్‌ లట్కే(52) గా గుర్తించారు. 

బుధవారం అర్ధరాత్రి శివసేన ఎమ్మెల్యే రమేష్‌ లట్కే దుబాయ్‌లో కన్నుమూశారు. ఆయన విడిది చేసిన చోటే తీవ్ర గుండెపోటుకు గురై ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఆయన మరణాన్ని శివ సేన వర్గాలు ధృవీకరించాయి. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపాయి. ఇదిలా ఉంటే  ఎమ్మెల్యే హఠాన్మరణంతో మహా రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. పార్టీలకతీతంగా నివాళులు అర్పిస్తున్నారు నేతలు. 

ముంబై అంధేరీ ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రమేష్‌ లట్కే. ఎమ్మెల్యే కాకముందు బీఎంసీలో కార్పొరేటర్‌గా కూడా పని చేశారు.

మరిన్ని వార్తలు