మహా పాలి‘ట్రిక్స్‌’.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన

1 Jul, 2022 11:06 IST|Sakshi

మహారాష్ట‍్ర రాజకీయాల్లో ట్విస్టుల మీద సస్పెన్స్‌లు కొనసాగిన విషయం తెలిసిందే. రెబల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో పొలిటికల్‌ డ్రామా నడిచింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే.. సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం, శివసేన రెబల్‌ ఎమ్మెల్యే ఏక్‌నాథ్‌ షిండే.. బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు వేశారు. బీజేపీ అధిష్టానం నిర్ణయంతో మహారాష్ట‍్ర సీఎంగా ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ‍్నవీస్‌ బాధ్యతలు స్వీకరించారు. 

ఇదిలా ఉండగా.. అనూహ్యంగా శివసేన శుక్రవారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో అనర్హత తేలే వరకు 16 మం‍దిని సస్పెండ్‌ చేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. శుక్రవారం పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. కాగా, అంతకుముందు శివసేన.. సీఎం ఏక్‌నాథ్‌ షిండేతోపాటు 15 మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. 

మరోవైపు.. మహారాష్ట్రలో ఈనెల 3, 4 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో 3వ తేదీన స్పీకర్‌ ఎన్నిక, 4వ తేదీన బలనిరూపణకు పరీక్ష ప్లాన్‌ చేసినట్టు సమాచారం. 

ఇది కూడా చదవండి: శరద్‌ పవర్‌కు ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ నోటీసులు

మరిన్ని వార్తలు