సంజయ్‌ రౌత్‌ కస్టడీ 5 వరకు పొడిగింపు

23 Aug, 2022 06:34 IST|Sakshi

ముంబై: శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌(60) జ్యుడీషియల్‌ కస్టడీని ప్రత్యేక కోర్టు వచ్చే నెల 5 వరకు పొడిగించింది. ముంబై చౌల్‌ అభివృద్ధి పనుల్లో అవకతవకలపై నమోదైన మనీలాండరింగ్‌ కేసులో ఈనెల ఒకటిన ఈడీ ఆయన్ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

ఆయన జ్యుడీషియల్‌ కస్టడీ సోమవారంతో ముగియడంతో ప్రత్యేక జడ్జి ఎంజీ దేశ్‌పాండే ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నందున కస్టడీని పొడిగించాలని ఈడీ          విజ్ఞప్తి చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న జడ్జి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు ఆయన కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. 

మరిన్ని వార్తలు