-

త్వరలో ఫలితం చూస్తావు : శివసేనే హెచ్చరిక

12 Sep, 2020 18:41 IST|Sakshi

ముంబై : ఇటీవల ముంబైపై బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ చేసిన వ్యాఖ్యలపై మహరాష్ట్ర అధికార పార్టీ శివసేన మరోసారి ఘాటుగా స్పందించింది. పార్టీ అధికార పత్రిక సామ్నా ద్వారా పరోక్షంగా శనివారం కంగనాపై మాటల యుద్దానికి దిగింది. ‘ముంబై పాకిస్తాన్‌ అక్రమిత కశ్మీర్(పీఓకే)’‌ కాదని, అలాంటి వ్యాఖ్యలు చేసిన వారు త్వరలోనే దాని ఫలితాన్ని ఆనందిస్తారని వ్యంగ్య వ్యాఖ్యలు చేయడమే కాకుండా కంగనాకు శుభాకాంక్షలు(ముబారక్‌ హో) అంటూ వ్యాఖ్యానించింది. అదే విధంగా దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై ఈ మధ్య వివాదాలకు అలవాటు పడిందని శివసేన పేర్కొంది. ఏ విధంగా అంటే.. మహాభారతంలో కౌరవులు ద్రౌపతి వస్ర్తాభరణ చేస్తుండగా పాండవులంతా తలవంచుకుంటారు... ప్రస్తుతం శివసేన కూడా అదే చేస్తుంది అని తెలిపింది. (చదవండి: విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేసిన డీజీసీఏ)

అయితే ముంబై జాతీయ సమగ్రతకు ప్రతీక అని అందరికి తెలిసినప్పటికీ వివాద మాఫీయా ఎప్పుడూ ముంబైని మాత్రమే విమర్శిస్తుంది తప్పా ఇతర రాష్ట్రాల రాజధానులను కాదంటూ సామ్నాలో శివసేన పేర్కొంది.  ఛత్రపతి షాహు మహారాజ్‌, మహాత్మా జ్యోతిరావ్‌ పులే, భీమరావు అంబేద్కర్‌ జన్మించిన మహరాష్ట్ర  ఒక దేశమని; మహారాష్ట్ర మరణిస్తే, దేశం నశించిపోతుందని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు సేనాపతి పాండురంగ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా శివసేన గుర్తు చేసింది. దురదృష్టవశాత్తు, సంయుక్త మహారాష్ట్ర ఉద్యమ నాయకుడు దివంగత ప్రబోధంకర్ ఠాక్రే ఇచ్చిన జ్ఞానోదయంతో కానీ భారత రాజ్యాంగ వాస్తుశిల్పి అంబేద్కర్ ఆలోచనలతో సంబంధం లేని వారికి స్వాగతమివ్వడం బాధాకరమని.. విమనాశ్రయం నుంచి కంగనాకు వై కాటగిరి సెక్యూరిటితో స్వాగతం పలకడంపై అధికార పార్టీ ఆసహనం వ్యక్తం చేసింది. (చదవండి: కంగనా వివాదం : పవార్‌ కీలక వ్యాఖ్యలు)

మరిన్ని వార్తలు