Shiv Sena MP Sanjay Raut: సంజయ్‌ రౌత్‌ జ్యుడీషియల్‌ కస్టడీ మరో 2 వారాలు పొడిగింపు

22 Aug, 2022 17:09 IST|Sakshi

ముంబై: మనీలాండరింగ్‌ కేసులో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు ఇప్పట్లో ఉపశమనం లభించేలా కనిపించటం లేదు. ఆయనకు విధించిన జ్యుడీషియల్‌ కస్టడీనీ మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం. ముంబైలోని పాత్రాచాల్‌ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై ఆగస్టు 1న సంజయ్‌ రౌత్‌ను అరెస్ట్‌ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.

ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం కేసుని విచారించిన న్యాయస్థానం ఆగస్టు 8న 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.  ఆ గడువు సోమవారంతో ముగియనుండటంతో సంజయ్‌ రౌత్‌ను ముంబై ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరించింది ఈడీ. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్‌పాండే.. సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు జ‍్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి: సంజయ్‌ రౌత్‌ అరెస్ట్‌.. ఈడీ తరువాత టార్గెట్‌ ఎవరో? 

మరిన్ని వార్తలు