మొక్కజొన్న మంటల్లో 6గురు చిన్నారుల సజీవ దహనం

30 Mar, 2021 17:55 IST|Sakshi

పాట్నా: సరదాగా మొక్కజొన్నలు కాల్చుకుంటుండగా ఆ నిప్పు కాస్త పూరి గుడిసెపై పడి ఏకంగా ఆరుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకుపోయారు. చివరకు ఆ మంటల్లోనే సజీవ దహనమయ్యారు. ఈ ఘోర సంఘటన బిహార్‌లో జరిగింది. అరారియా జిల్లా కబయా గ్రామంలో మంగళవారం చిన్నారులు మొక్కజొన్న కంకులు నిప్పులపై కాల్చుకుంటున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా ఆ మంటలు వెళ్లి పూరి గుడిసెపై పడ్డాయి. గడ్డితో చేసిన గుడిసెలు కావడంతో వెంటనే మంటలు దావనంలా వ్యాపించాయి. మంటల నుంచి తప్పించుకునే అవకాశం లేదు.

దీంతో ఆ చిన్నారులు మంటల్లో చిక్కుకున్నారు. వారి హాహాకారాలు విన్న కుటుంబసభ్యులు, స్థానికులు మంటలు ఆర్పేందుకు విఫల ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆ చిన్నారులు మంటల్లో సజీవ దహనమయ్యారు. సరదాగా మొక్కజొన్నలు తినాల్సిన చిన్నారులు బొగ్గుల్లా మారిపోయారు. ఆ చిన్నారుల వయసు 3 నుంచి 6 ఏళ్లలోపే. ఈ హృదయ విదారక ఘటన అందరినీ కలచివేస్తోంది. అయితే అంతకుముందు రోజే బిహార్‌లో కాముడి దహనం చేస్తుండగా ఆ మంటల్లో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

చిన్నారుల వివరాలు
గుల్నాజ్‌ (3)
బర్కాస్‌ (4)
అశ్రఫ్‌ (5)
అలీ హసన్‌ (5)
ఖుశ్‌ నిహార్‌ (5)
దిల్వార్‌ (6)

చదవండి: ఇన్‌స్టాలో ప్రేమ.. గుళ్లో పెళ్లి.. హాస్టల్‌లో ఆత్మహత్య
చదవండి: ముగ్గురి గ్యాంగ్‌ రూ.3 కోట్ల మోసం

మరిన్ని వార్తలు