షాకింగ్‌: 6 అడుగుల పామును లుంగీలో వేసుకొని వెళ్లాడు

18 May, 2021 13:21 IST|Sakshi

పాములంటే అందరికి చచ్చేంత భయం. వాటిని తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఒకవేళ పాములు మన కంట పడితే.. ఇంకేమైనా ఉందా ఇక అక్కడి నుంచి పరుగున జారుకోవడమే. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏమాత్రం బేరుకు లేకుండా ఆరు అడుగుల పామును తన చేతులతో అవలీలగా ఆడించాడు. పాము అతన్ని కాటేసేందుకు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ దానికి చిక్కకుండా భలే మేనేజ్‌ చేశాడు. చివరికి పామును తను కట్టుకున్న లుంగీలో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు.

అప్పట్లో ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుశాంత్‌ నంద తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘లుంగీని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియో మరోసారి వార్తలోకెక్కింది. తాజాగా ఓ ట్విటర్‌ యూజర్‌ మళ్లీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. ఇందులో దాదాపు 6 అడుగుల పామును పట్టుకొని లుంగీలో వేసేసుకొని హ్యాపీ వెళ్ళిపోతున్నాడు. అయితే దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం షాక్‌కు గురవుతున్నారు. సదరు వ్యక్తి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.

చదవండి: అరుదైన పాము పట్టివేత.. ఎప్పుడైనా చూశారా..

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు