స్కూల్‌ బస్సులో దూరిన భారీ కొండ చిలువ.. షాకింగ్‌ వీడియో

16 Oct, 2022 20:44 IST|Sakshi

ఈ మధ్యకాలంలో పాములు ఒక్కడి పడితే అక్కడ ప్రత్యక్షమవుతున్నాయి. ఇళ్లు, షూలు, బైక్‌లు.. ఇలా కనిపించిన ప్రతిచోటా దూరిపోతున్నాయి. అనుకొని ప్రదేశాల్లో పాములు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. రాయ్‌బరేలిలోని ఓ పాఠశాల బస్సులో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది.

పాఠశాలకు సెలవు కావడంతో బస్సును డ్రైవర్‌ తన గ్రామానికి తీసుకెళ్లి ఇంటి దగ్గర పార్క్‌ చేశాడు. ఆ బస్సు పక్క నుంచి మేకల మంద వెళ్తుంటే బస్సులో నుంచి వింత శబ్దాలు రావడంతో గ్రామస్తులు గమనించారు. బస్సులో ఏదో ఉందనే అనుమానంతో పరిశీలించి చూడగా.. భారీ కొండచిలువ బస్సులో తిష్ట వేసింది. ఇంజిన్‌ భాగం వద్ద ఓ సీట్‌ కింద పెద్ద కొండచిలువ దాక్కుంది. 
చదవండి: వైరల్‌: 30 ఏళ్లు వచ్చే దాకా తొందరపడొద్దు.. టీనేజర్‌కు జో బైడెన్‌ సలహా

సమాచారం అందుకున్న సిటీ సీఓ వందనా సింగ్, సిటీ మెజిస్ట్రేట్ పల్లవి మిశ్రా అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గంటపాటు శ్రమించి కొండచిలువను పట్టుకున్నారు. పట్టుకున్న కొండచిలువ బరువు 80 కేజీలు, పదకొండున్నర అడుగుల పొడవు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం దానిని అడవిలో విడిచిపెట్టారు.

అటవీ అధికారులు బస్సులో నుంచి కొండచిలువను తీస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఒక అధికారి స్కూలు బస్సు దిగువ నుంచి కొండచిలువను లాగడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అదృష్టవశాత్తూ ఆదివారం కావడంతో పాఠశాల మూసివేయడంతో  ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

మరిన్ని వార్తలు