Shocking Video: రైలు దిగుతూ పడిపోయిన వృద్ధుడు..చివరికి

8 Jul, 2021 15:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పట్టాలపై పడిపోతున్న వృద్ధుడిని కాపాడిన ఆర్‌పీఎఫ్ సిబ్బంది

ఊపిరి పీల్చుకున్న  స్థానికులు

సాక్షి,లక్నో: రెప్పపాటులో మృత్యుముఖం నుంచి ఒక వ్యక్తిని కాపాడిన షాకింగ్‌ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రైల్వే ప్లాట్‌ఫాంల వద్ద  అప్రమత్తంగా ఉండాలని, , కదులుతున్న రైళ్లను ఎక్కొద్దు, దిగవద్దు అంటూ పదే పదే ర్వైల్వే శాఖ హెచ్చరిస్తున్నా,  చాలామంది ప్రమాదం అంచున నిలబడుతున్నారు.  కానీ  రక్షణ సిబ్బంది  మెరుపు వేగంతో కదిలి వారిని కాపాడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌, ఘజియాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్నఇలాంటి షాకింగ్‌ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది స్పందించి, కాపాడిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

రెప్పపాటు నిర్లక్ష్యం నిండు జీవితాన్ని బలితీసుకుంటుంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా చూశాం. గుండెల్లో  రైళ్లు పరిగెట్టించే ఇలాంటి వీడియోలు హల్‌చల్‌ చేస్తూనే  ఉన్నాయి.  అయినా  పట్టించుకోకుండా చాలామంది అదే నిర్లక్క్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఆందోళన పుట్టిస్తోంది.

తాజా ఘటన వివరాల్లోకి వెళితే..ఘజియాబాద్‌ రైల్వే స్టేషన్‌లో గోమతి ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాంపైకి వస్తోంది. అంతలోనే ఒక వృద్ధుడు రైల్లోంచి దిగుతూ పట్టు తప్పి జారి పోయాడు. దీన్ని గమనించిన ఆర్‌పీఎఫ్‌ అధికారి శరవేగంతో ఆ వృద్ధుడిని సురక్షితంగా కాపాడారు.వృద్ధుడు రైల్లోంచి జారి పట్టాలపై పడిపోతున్న దృశ్యం అక్కడి వారిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. కానీ పోలీసులు సకాలంలో స్పందించడంతో లిప్తపాటులో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ప్లాట్‌ఫాంపై  ఉన్న వారంతా ఊపిరి పీల్చు కున్నారు. మరోవైపు చాకచక్యంగా వ్యవహరించి వృద్ధుడిని కాపాడిన ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్స్ త్రిలోక్ శర్మ, శ్యామ్ సింగ్‌లను పొగడ్తలతో ముంచెత్తారు.

మరిన్ని వార్తలు