వాషింగ్ మెషీన్ ఆన్‌ చేసి లైట్‌ తీసుకోకండి!

5 May, 2021 10:06 IST|Sakshi

మనం తరుచూ ఛార్జింగ్‌ పెట్టిన ఫోన్‌ పేలిందని, గ్యాస్‌ లీకై పేలిందనే వార్తలు వింటుంటాం. కానీ మీరెప్పుడైనా వాషింగ్ మెషీన్ పేలిందని విన్నారా. అవును ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా వాషింగ్ మెషీన్ పేలే అవకాశం ఉంది.  చాలా మంది వాషింగ్ మెషీన్ లో బట్టలు వేసి స్విచ్‌ ఆన్‌ చేస‍్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ అలా చేయడం ముమ్మాటి తప‍్పే. కొన్ని చిట్కాలు పాటిస్తే వాషింగ్ మెషీన్ను ఎక్కువ కాలం వినియోగించుకోవడమే కాదు ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండొచ్చు.   

ఇటీవల స్కాట్లాండ్ కు చెందిన లూరా బిరెల్ అనే మహిళ వాషింగ్ మెషీన్ లోలో బట్టలు వేసి, ఇంట్లోనే మరో పనిలో నిమగ్నమైంది. వాషింగ్ మెషీన్ బటన్‌ ఆన్‌ చేసిన కొద్ది సేపటి తర్వాత ఇంట్లోనే బాంబు పేలిన శబ్ధం వినిపించింది. దీంతో ఆందోళనకు గురైన లూరా.. ఏం జరిగిందోనని  వాషింగ్ మెషీన్ వైపు చూడగా.. అది పేలి పొగలు రావడం గమనించింది. వెంటనే వాషింగ్ మెషీన్ స‍్విచ్‌ ఆఫ్‌ చేసింది. అయితే తనకు జరిగిన చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకుంది. ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. వాషింగ్ మెషీన్ ఆన్‌ చేసి బయటకు వెళ్లి ఉంటే ఏమయ్యేదోనని ఊహించుకుంటే  భయమేస్తుందంటూ నెటిజన్లతో షేర్‌ చేసుకుంది. 

వాషింగ్ మెషీన్ పేలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు 
♦ ఎంబ్రాయిడరీ దుస్తులు, కాయిన్స్‌, మెమరీ ఫోమ్‌ దిండ్లు,స్నీకర్ షూస్‌, లెదర్‌ బ్యాగ్స్‌, జిప్పర్‌ లు ఎక్కువగా ఉన్న దుస్తుల‍్ని వాషింగ్‌ మిషన్‌ లో  వేయడం వల్ల దుస్తులు  పనికి రాకుండా పోవడమే కాకుండా, మిషన్‌ లోపల బట్టల్ని శుభ్రం చేసే చక్రాలు విరిగి పోయి, పేలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ చిన్ని చిట్కాల‍్ని అప‍్లయ్‌ చేయండి. జాగ్రత్తగా ఉండొచ్చు. 


♦ ఎంబ్రాయిడరీ దుస్తులు, కాయిన్స్‌, మెమరీ ఫోమ్‌ దిండ్లు,స్నీకర్ షూస్‌, లెదర్‌ బ్యాగ్స్‌, జిప్పర్‌ లు ఎక్కువగా ఉన్న దుస్తుల‍్ని వాహింగ్‌ మిషన్‌ లో  వేయడం వల్ల దుస్తులు  పనికి రాకుండా పోవడమే కాకుండా, మిషన్‌ లోపల బట్టల్ని శుభ్రం చేసే చక్రాలు విరిగి పోయి, పేలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి  ఈ చిన్ని చిట్కాల‍్ని అప‍్లయ్‌ చేస‍్తే ప్రమాదాల నుంచి సురక్షితంగా ఉండొచ్చు. 

♦ ట్యాప్‌ నుంచి వాషింగ్‌ మెషీన్‌లో​కి వాటర్‌ను పంపే పైపుల్ని మార్చుకోవాలి. ఆ పైపులు పగిలినా, లేదంటే వాటర్‌ లీక్‌ అయినా లోపల ఉండే మిషనరీ పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.  

♦ వాషింగ్‌ మెషీన్‌ ఆన్‌ లో ఉన్నప్పుడు వింత శబ్ధాలు వస్తుంటే వెంటనే దాన్ని మార్చుకోవడం ఉత్తమం. లేదంటే లేని పోని తలనొప్పిల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు కరెంట్‌ షాక్‌ తగలడం, మెషీన్‌ బ్లాస్ట్‌ అవ్వడంలాంటి ప్రమాదాల బారిన పడాల్సి వస‍్తుంది. 

♦ వాషింగ్‌ మెషీన్‌ చుట్టూ మీ పిల్లలు, లేదంటే పెంపుడు జంతువులు లేకుండా చూసుకోవాలి. వాషింగ్‌ మెషీన్‌ ఆన్‌ లో ఉండగా ఫ్రంట్‌ డోర్‌ సరిగ్గా వేశామా లేదా అనేది చెక్‌ చేసుకోవాలి. లేదంటే పిల్లలు ఆడుకునే బొమ్మల్ని లోపల వేస్తే..లోపల బట్టల్ని వాష్‌ చేసే చక్రాలు విరిగిపోయే ప్రమాదం ఉంది.  

♦ వాషింగ్ సమయంలో ఓవర్‌ లోడ్‌ కాకుండా చూసుకోవాలి. మీకు సూచించిన విధంగా మెషీన్‌ ను ఆపరేట్‌ చేయాలి.  

♦ వాషింగ్ మెషీన్‌ ను నీట్‌ గా కడగాలి. వాషింగ్ మెషీన్ క్లీనర్ లేదా వేడి నీళ్లు, వెనిగర్, బేకింగ్‌ సోడాల్ని వినియోగించాలి. వాటిని వినియోగిస్తే లోపల ఉన్న సర్ఫ్‌, సబ్బు ముక్కలు తొలగిపోతాయి. ఎలాంటి మరమ్మత్తులు రాకుండా  చూసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు