‘ప్రజల దృష్టి మళ్లించేందుకే డ్రగ్స్‌‌ కేసును వాడుకుంటోంది’

12 Sep, 2020 15:50 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కోవిడ్‌-19, వరదల నుంచి ప్రజలను దృష్టిని మళ్లించేందుకు కర్ణాటక ప్రభుత్వం డ్రగ్స్‌ను కేసును వాడుకుంటోందని ప్రతిపక్ష కాం‍గ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శించారు. అంతేగాక ఈ కేసులో అధికార బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ మంత్రులను, నాయకులను రక్షించుకునే ప్రయత్నం చేస్తుందని ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకులను కించపరిచారంటూ తన వరుస ట్వీట్‌లలో ఆరోపించారు. ఈ కేసులో దర్యాప్తు జరిపేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయవద్దని ఆయన సీఎం బీఎస్‌ యడియూరప్పను కోరారు. కరోనా విజృంభన, వరదల ఉధృతిపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా... డ్రగ్స్‌ కేసును ప్రధానంగా తీసుకోవడం దారణమంటూ #DrugsMuktaKarnataka హ్యాష్‌ ట్యాగ్‌ను తన ట్వీట్‌కు జోడించారు.

అంతేగాక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ కూడా స్పందిస్తూ.. ముస్లీం కావడం వల్లే తనను టార్గేట్‌ చేశారని మండిపడ్డారు. ఈ కేసులో జమీర్‌ అహ్మద్‌కు కూడా సంబంధం ఉన్నట్లు ప్రముఖ పారశ్రామిక వేత్త ప్రశాంత్‌ సంబరాగి ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రశాంత్‌ సంబరాగిపై పరువు నష్టం దావా వేస్తానని ఖాన్‌ హెచ్చిరించారు‌. అంతేగాక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మైసూర్‌ ఎంపీ ప్రతాప్‌ సింహాతో సహా కొందరూ బీజేపీ నాయకులను ఇప్పటికీ ఎందుకు విచారించ లేదని ఆయన  ప్రశ్నించారు. కేవలం ఒక ఫొటోతో రాజకియ నాయకులపై ఆరోపణలు చేయడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. 

ఇటీవల కన్నడ చిత్ర నిర్మాత లంకేష్‌ బెంగుళూరు సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ అధికారులు(సీసీబీ)కి పరిశ్రమలో మాదక ద్రవ్యాల వాడకంపై సమాచారం ఇవ్వడంతో శాండల్‌వుడ్‌లో డ్రగ్‌ కేసులో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ  కేసులో కొంతమంది సినీ ప్రముఖులతో పాటు నటి సంజన గల్రానీ ఆమె తల్లిని కూడా సీసీబీ అధికారులు అరెస్టు చేశారు.  ప్రస్తుతం వీరిని చమరాజ్‌ పేట ప్రాంతంలోని సీసీబీ కార్యాలయంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.

>
మరిన్ని వార్తలు