సిద్ధూకు తలొగ్గిన చన్నీ సర్కార్‌

18 Dec, 2021 07:06 IST|Sakshi

డీజీపీగా సిద్ధార్థ్‌కు బాధ్యతలు 

ఛండీగఢ్‌: సొంత పార్టీలోనే నిరసన గళం వినిపించే నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ డిమాండ్‌కు పంజాబ్‌లోని కాంగ్రెస్‌ సర్కార్‌ తలొగ్గింది. రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ సిద్ధూ డిమాండ్‌ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డీజీపీని మార్చింది. ఇక్బాల్‌ ప్రీత్‌ సింగ్‌సహోతాను తొలగించి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సిద్ధార్థ్‌ ఛటోపాధ్యాయ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి శాశ్వత ప్రాతిపదికన డీజీపీని నియమించేంతవరకు ఛటోపాధ్యాయ కొనసాగుతారని పేర్కొంది. ప్రస్తుతం విజిలెన్స్‌ బ్యూరో చీఫ్‌ డైరెక్టర్‌గా ఉన్న సిద్ధార్థ్‌ ఆ బాధ్యతల్లోనూ కొనసాగుతారు.

సెప్టెంబర్‌లో చరణ్‌జిత్‌సింగ్‌ చన్నీ సీఎంగా ప్రమాణం చేయగానే ఐపీఎస్‌ అధికారి సహోతాను డీజీపీగా నియమించారు. అయితే తన మీద వచ్చిన ఆరోపణల విచారణకోసం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందానికి నాయకత్వం వహించిన సహోతాను డీజీపీగా నియమించడాన్ని సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకించారు. డీజీపీగా సిద్ధార్థ్‌ను నియమించాలని ఒత్తిడి తెస్తూనే ఉన్నారు.

మరిన్ని వార్తలు