‘అదేమన్నా పిక్నిక్‌ స్పాటా’.. మోడల్‌పై ప్రధానికి ఫిర్యాదు

29 Nov, 2021 18:59 IST|Sakshi

కర్తార్‌పూర్‌ గురుద్వార వద్ద ఫోటో షూట్‌

దుస్తుల కంపెనీ, మోడల్‌పై ఆగ్రహం

న్యూఢిల్లీ: సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్‌పూర్‌ గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ వద్ద ఫోటోషూట్‌ చేయడమే కాక.. తలపై వస్త్రం ధరించనందుకు గాను పాకిస్తాన్‌ మోడల్‌ని ట్రోల్‌ చేస్తున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన దుస్తుల కంపెనీ మన్నత్‌ ​కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా వద్ద ఓ యాడ్‌ని షూట్‌ చేసింది. దీనిలో నటించిన మోడల్‌ తలపై వస్త్రం ధరించకుండా షూట్‌లో పాల్గొని.. ఫోటోలకు పోజులిచ్చింది. 

ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో సదరు కంపెనీ, మోడల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు. ముఖ్యంగా సిక్కు సామాజిక వర్గం వారు ఈ యాడ్‌పై చాలా గుర్రుగా ఉన్నారు. ‘‘మేం ఎంతో పవిత్రంగా భావించే స్థలంలో మీరు యాడ్‌ షూట్‌ చేస్తారా.. ఇదేమైనా పిక్నిక్‌ స్పాట్‌ అనుకుంటున్నారా ఏంటి’’ అంటూ విమర్శిస్తున్నారు.
(చదవండి: కుక్క హెయిర్‌ డై కోసం 5 లక్షలు.. మోడల్‌ను ఆడేసుకుంటున్న నెటిజన్లు.!)

ఈ నేపథ్యంలో శిరోమణి అకాళీ దల్‌ నేత (ఎస్‌ఏడీ), ఢిల్లీ సిక్కు గురుద్వారా పర్బంధక్ కమిటీ అధినేత మంజిందర్ సింగ్ సిర్సా దీనిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను కోరారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌ మినిస్టర్‌ పవాద్‌ చౌదరి స్పందిస్తూ.. సదరు దుస్తుల కంపెనీ, మోడల్‌ తమ చర్యలకు గాను క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
(చదవండి: తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఫొటోకు ఫోజులు.. మండిపడుతన్న నెటిజన్లు)

వివాదం కాస్త పెద్దదవడంతో మన్నత్‌ కంపెనీ క్షమాపణలు చెప్పింది. అంతేకాక ‘‘సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఫోటోల ప్రకారం కర్తార్‌పూర్‌ కారిడార్‌ వద్ద ఫోటో షూట్‌ చేసింది తాము కాదని.. థర్డ్‌ కంపెనీ వారు తమ మన్నత్‌ వస్త్రాలు ధరించి.. అక్కడ యాడ్‌ షూట్‌ చేశారని’’ తెలిపారు. 

చదవండి: మోడల్‌ దారుణ హత్య: గొంతు కోసి.. నగ్నంగా మార్చి

మరిన్ని వార్తలు