దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. స్టేజ్‌పైనే కుప్పకూలిన ప్రముఖ గాయకుడు

4 Oct, 2022 07:57 IST|Sakshi
గుండె పోటుకు ముందు పాట పాడుతున్న మురళీ మహాపాత్రొ   

జయపురం: పట్టణంలో సంబరంగా జరుగుతున్న దసరా ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. శరన్నవరాత్రి సంబరాల్లో సందర్భంగా నిర్వహకులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి జయపురం రాజ్‌మహల్‌ కూడలి వద్ద విశాలమైన వేదికపై సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే తారాప్రసాద్‌ బాహినీపతి, మున్సిపల్‌ చైర్మన్‌ నరేంద్రకుమార్‌ మహంతి, సబ్‌ కలెక్టర్‌ దేవధర ప్రధాన్, మున్సిపల్‌ కార్యనిర్వాహక అధికారి సిద్ధార్థ పట్నాయక్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు మురళీ మహాపాత్రొ తన బృందంతో కలిసి సుమధుర గీతాలతో శ్రోతలను అలరించారు. అనంతరం మిగతా గాయకులు పాడుతుండగా.. కుర్చీ నుంచి వారిని ప్రోత్సహిస్తున్న ఆయన హఠాత్తుగా గుండె నొప్పితో వేదికపై ఒరిగిపోయారు. నిర్వాహకులు, తోటి కళాకారులు వెంటనే జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మరణించినట్లు ప్రకటించారు. దీంతో అంతా షాక్‌కు గురయ్యారు. దసరా వేడుకల్లో ఇటువంటి అవాంఛనీయ ఘటన జరగడం దురదృష్టకరమని నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. 

చదవండి: (NIMS Director: అనారోగ్యంతో అపోలోకు.. ఆరోగ్యంగా నిమ్స్‌కు..!)

మరిన్ని వార్తలు