వారికి స్పుత్నిక్‌ వీ సింగిల్‌ డోసు చాలు.. 

13 Jul, 2021 12:03 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా సోకి కోలుకున్న వారికి స్పుతి్నక్‌ వీ వ్యాక్సిన్‌ సింగిల్‌ డోసు సరిపోతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. అర్జెంటీనా వేదికగా జరిపిన ఈ పరిశోధనలో కరోనా సోకిన వారు స్పుత్నిక్‌ వీ రెండో డోసు తీసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉన్నట్లు కనిపించలేదని పరిశోధకులు చెప్పారు. ఈ పరిశోధన సైన్స్‌ డైరెక్ట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

అయితే రెండో డోసు కూడా వేసుకుంటే యాంటీబాడీలు పెరగడంతో పాటు న్యూట్రలైజింగ్‌ సామర్థ్యం పెరుగుతుందని స్పష్టం చేశారు. సింగిల్‌ డోసు పూర్తయిన 21 రోజుల తర్వాత పరిశీలించగా పెద్దగా ప్రభావం లేదని నివేదిక తెలిపింది. ఒక్క డోసు వ్యాక్సిన్‌తోనే ఏకంగా 94శాతం ప్రభావం ఉంటోందని, అందువల్ల రెండో డోసు తీసుకున్నప్పటికీ పెద్ద మార్పు లేదని నివేదికలో పేర్కొన్నారు. అర్జెంటీనాలోని ఆరోగ్య కార్యకర్తలపై ఈ పరిశోధన చేశారు.
  

మరిన్ని వార్తలు