-

జైల్లో స్టాన్‌ స్వామికి సిప్పర్‌

30 Nov, 2020 08:04 IST|Sakshi

ముంబై : ఎల్గార్‌పరిషత్‌ కేసులో తలోజా జైలులో ఉన్న స్టాన్‌స్వామి(83)కి సిప్పర్‌తో పాటు ఇద్దరు సహాయకులను ఏర్పాటు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. పార్కిన్‌సన్స్‌ వ్యాధితో బాధపడుతోన్న ఆదివాసీ హక్కుల నేత స్టాన్‌స్వామిని మావోయిస్టులతో సంబంధం ఉందన్న ఆరోపణలతో అక్టోబర్‌ 8న అరెస్టు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), స్టాన్‌ స్వామి పట్ల అమానవీయం గా ప్రవర్తించడాన్ని సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. అరెస్టు సందర్భంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న సిప్పర్‌ని తిరిగి అందజేయాల్సిందిగా కోరుతూ స్టాన్‌స్వామి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

పార్కిన్‌సన్స్‌ వ్యాధి కారణంగా చేతులు వణుకుతున్నందున సిప్పర్‌ ద్వారా ఆహారపదార్థాలను సేవించేందుకు అనుమతి నివ్వాలంటూ ఆయన ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టుకి విన్నవించారు. శనివారం తలోజా జైలుని సందర్శించిన జైళ్ల శాఖ ఐజీపీ చేరింగ్‌ దోర్జే, స్టాన్‌స్వామి అవసరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనం తరం జైలు అధికారులు స్టాన్‌ స్వామికి సిప్పర్, స్ట్రా, వీల్‌ ఛైర్, వాకింగ్‌ స్టిక్, వాకర్‌తోపాటు ఇద్దరు సహాయకులను ఏర్పాటు చేశారు. 

 

మరిన్ని వార్తలు