వీడియో వైరల్‌: వేలు చూపిస్తూ వార్నింగ్‌, అంతలోనే తుపాకీతో..

15 Jun, 2021 17:34 IST|Sakshi

జైపూర్‌: రాజస్తాన్‌ కోట జిల్లా మార్కెట్‌లో పట్టపగలే బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకులతో ఒక షాపు యజమానిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సదరు షాపు యజమాని తృటిలో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో వెలుగులోకి వచ్చింది. మొత్తం 38 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో ముగ్గురు వ్యక్తులు అక్కడున్న మిగతా షాపుల యజమానులకు వేలు చూపిస్తూ వార్నింగ్‌ ఇస్తుండగా.. ఒక వ్యక్తి మాత్రం తుపాకీతో కాల్పులు జరిపి అక్కడినుంచి పరారయ్యారు. 

ఈ పరిణామంతో అక్కడున్నవారంతా భయభ్రాంతులకు లోనయ్యి బయటికి వచ్చే దైర్యం చేయలేదు. కాగా  కైలాష్‌ మీనా అనే పండ్ల వ్యాపారిపై  దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఇదే విషయమై కైలాష్‌ మీనా స్పందింస్తూ.. '' రెండు బైక్ లపై ఆరుగురు యువకులు వచ్చారు. వారు ఎందుకు తనపై హత్యాయత్నం చేశారో తెలియదు. పండ్లు, కూరగాయల కమిషన్ ఏజెంట్ అయిన నేను కొన్నేళ్లుగా ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నా. తనకెవరూ శత్రువులు లేరు. అలాంటిది వాళ్ళు నన్ను టార్గెట్ చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటో తెలియడం లేదు. అయితే తనపై దాడి చేసేందుకు వచ్చిన దుండగుల్లో ఒక్కరిని కూడా గుర్తుపట్టలేకపోయాను.'' అని చెప్పుకొచ్చాడు. 

మీనా ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. కాగా కైలాష్ మీనా ఈ మండిలో తోటి వ్యాపారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటాడని తెలిసింది. బహుశా అది దృష్టిలో పెట్టుకుని ఎవరైనా ఈ యువకులను ప్రోత్సహించి ఉంటారా అని పోలీసులు భావిస్తున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
చదవండి: 13 వాహనాలు ధ్వంసం: ఎస్‌ఐ కుమారుడు సహా ఇద్దరి అరెస్టు

దారుణం: కొడుకులపై తండ్రి కాల్పులు.. ఒకరి మృతి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు