అన్నీ తెరిచాక ఇంకేం... డ్రామా మాత్రమే

31 Aug, 2021 14:01 IST|Sakshi

సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...!


అన్నీ తెరిచాక ఇంకేం...

ఢిల్లీలో ప్రతి రెస్టారెంటూ జనంతో కిక్కిరిసి ఉంది. అన్ని మార్కెట్లు సందడిగా ఉన్నాయి. రోడ్ల మీద ట్రాఫిక్‌ జాములు అవుతున్నాయి. కానీ జన్మాష్టమిని జరుపుకోవడానికి గుళ్లకు మాత్రం వెళ్లకూడదట. ఎందుకు అని అడగొద్దు. కేజ్రీవాల్‌ ప్రభుత్వంలో ఎందుకు అనే తర్కం పనికిరాదు.
– స్మితా బారువా, రచయిత్రి


స్నేహ హస్తం

మొదటి విడత అఫ్గాన్‌ శరణార్థులను కొసావో స్వాగతిస్తోంది. మరీ ఎక్కువ కాలం కాలేదు, మేము కూడా ఒకప్పుడు శరణార్థులమే. కొత్తగా ఏర్పడిన మా దేశాన్ని గుర్తించిన మొదటిదేశం అఫ్గానిస్తాన్‌. మీరు మా స్నేహితుల్లో భాగం, స్వాగతం.
– త్యూతా సాహత్ఖిజా, మాజీ మంత్రి


ఇలా చేయగలమా!

స్పెయిన్లోని పొంటేవేద్రా పట్టణంలో 21 ఏళ్లుగా కార్లు లేవు.  70 శాతం మంది అవసరాల నిమిత్తం నడిచే వెళ్తారు. ట్రాఫిక్, వాహనాల రద్దీ లేకపోవడంతో వీధుల్లో మనుషుల మాటలు తప్ప, రణగొణధ్వనులు వినిపించవు.    
– ఎరిక్‌ సోల్హెయిమ్, పర్యావరణవేత్త


అంతా ఒకే తానులో...

పౌరులను ఇబ్బందులకు గురిచేయడం ఎప్పుడైతే పోలీసుల దినచర్యలో భాగం అవుతుందో, తలలు పగలగొట్టడాన్ని ఎప్పుడైతే అధికారులు గొప్పగా చెప్పుకుంటారో– ఇక దాన్ని వ్యక్తిగత రక్తదాహం అనలేము. అది మొత్తం వ్యవస్థ గుణం, ఉద్దేశాలను పట్టిస్తుంది.          
– సుహాస్‌ పల్షికర్, వ్యాఖ్యాత


డ్రామా మాత్రమే
ఇప్పుడు ఐఎస్కేపీ ఏం చేస్తున్నదో రెండు వారాల క్రితం దాకా సరిగ్గా తాలిబన్‌ అదే చేసింది. ఉన్నపళంగా వాళ్లు ధగధగ మెరిసే కవచాల్ని ధరించే యోధులైపోయి, ఐఎస్కేపీ హింస నుండి ప్రపంచాన్ని కాపాడుతారా? వాస్తవంలోకి రండి. పాశ్చాత్య సొమ్మును లాగడానికి ఐఎస్కేపీ పాత్రను మరీ పెంచి చూపుతున్నారు.
– సుశాంత్‌ సరీన్, విశ్లేషకుడు


హింసా ఉత్సవం
విద్యుత్‌ చార్జీలు తగ్గించాలన్నందుకు బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపిం చాడు చంద్రబాబు. జనరల్‌ డయ్యర్‌ వారసుడే ఈ పచ్చాసురుడు. ఆ ఘటన జరిగి సరిగ్గా 21 ఏళ్లు. అందుకే ఇవాళ పచ్చ మంద వీధుల్లోకొచ్చి ఉత్సవాలు చేసుకున్నారు. పచ్చనేతల అధర్మ పోరాటం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. 
– వి.విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ


ముందే తెలిస్తే...
మొదటి పాతికేళ్లు మన విజయాన్ని మార్కులతో కొలుస్తాం; కానీ నిజమైన విలువ నేర్చుకోవడంలోనూ, విమర్శనాత్మకంగా ఆలోచించడంలోనూ ఉందని చివరకు గ్రహిస్తాం. తర్వాతి పాతికేళ్లు మన విజయాన్ని ఎంత సంపాదించాం అన్నదానితో కొలుస్తాం; కానీ మన సమయాన్ని ఎలా, ఎవరితో గడుపుతున్నాం అనేదే ముఖ్యమని చివరకు గ్రహిస్తాం.
– వాలా అఫ్షార్, డిజిటల్‌ ఇవాంజెలిస్ట్‌ 

మరిన్ని వార్తలు