కేంద్ర మంత్రులు సింధియా, స్మృతి ఇరానీకి అదనపు బాధ్యతలు

6 Jul, 2022 21:16 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి అదనంగా  మైనార్టీ సంక్షేమ శాఖను అప్పగించారు. ఈ క్రమంలోనే జ్యోతిరాధిత్య సింధియాకు ఉక్కు, గనుల శాఖను కేటాయించారు.

అయితే, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తన పదవికి బుధవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజ్యసభ ఎంపీగా గురువారం ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నఖ‍్వీతో పాటుగా రామ్ చంద్ర ప్రసాద్ సింగ్ కూడా రాజీనామా చేశారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు.. కేబినెట్ మంత్రి స్మృతి ఇరానీకి ప్రస్తుతం ఉన్న పోర్ట్‌ఫోలియోతో పాటు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను కూడా కేటాయించాలని రాష్ట్రపతి ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. 

మరిన్ని వార్తలు