నాకు కోపం తెప్పించొద్దు : స్మృతి ఇరానీ

1 Dec, 2020 14:14 IST|Sakshi

న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. జీవిత విషయాల దగ్గరనుంచి ఫన్నీ మీమ్స్‌ వరకు ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేయడంలో ఆమె ముందుంటారు. స్మృతి పెట్టే పోస్టులకు బోలెడంత మంది ఫ్యాన్స్‌ ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. లేటెస్ట్‌గా తాజా ట్యూస్‌డే(మంగళవారం ) అంటూ యాంగ్రీ లుక్స్‌తో మరోసారి అలరించారు. (ఎన్డీయేకు మరో మిత్రపక్షం గుడ్‌బై..!)

కోపంతో  ఉన్న స్మృతి చిన్ననాటి ఫోటో, ఇప్పటి ఫోటోను షేర్‌ చేస్తూ.. నన్ను ఆగ్రహానికి గురిచేయొద్దు (డోంట్‌ యాంగ్రీ మీ) అంటూ ‌ ఫ్లాష్‌బ్యాక్‌ ఫోటోను పోస్ట్‌ చేశారు. ఏళ్లు గడిచేకొద్ది రూపంలో మార్పులు వస్తాయి కానీ  హావభావాల్లో కాదు అంటూ ఓ క్యాప్షన్‌ను జోడించారు. ఇక స్మృతి పోస్ట్‌ చేసిన ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి 20వేలకు పైగా లైకులు వచ్చాయి. ఇక కొద్ది రోజుల క్రితమే స్మృతి కరోనా నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. (వంటగదిలో ఎవరున్నారు.. రాహులే రాశీ!)

A post shared by Smriti Irani (@smritiiraniofficial)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా