స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్‌

28 Oct, 2020 19:48 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తనతో టచ్‌లోకి వచ్చిన వారందరూ వెంటనే కోవిడ్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా స్మతి ఇరానీ విజ్ఞప్తి చేశారు. "ఓ ప్రకటన చేసే క్రమంలో నేను పదాల కోసం వెతకడం చాలా అరుదు. అందుకే నేను చాలా సరళంగా చెబుతున్నా. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో టచ్‌లోకి వచ్చిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను" అని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. 

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున స్మృతి ఇరానీ స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు. గత వారం ఆమె బిహార్‌లో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. గోపాల్‌గంజ్‌, ముంజర్‌, బోధ గయా, దిఘా వంటి ప్రాంతాల్లో దాదాపు 10 ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్మృతికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు ఆందోళనకు గురవుతున్నారు.

మరిన్ని వార్తలు