రాజస్తాన్‌ కోటలో ఘనంగా స్మృతి ఇరానీ కూతురు పెళ్లి

10 Feb, 2023 12:48 IST|Sakshi

కేంద్ర మంత్రి, మాజీ నటి స్మృతి ఇరానీ కుమార్తె షానెల్లే వివాహం రాజస్తాన్‌ కోటలో గురువారం ఘనంగా జరిగింది. ఈ మేరకు స్మృతి కూతురు షానెల్లేకి, అర్జున్‌ భల్లాకి 2021లో నిశ్చితార్థం కాగా, గురువారం రాజస్తాన్‌లో ఖిమ్‌సర్‌ కోటలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకలో షానెల్లె ఎరుపు రంగు లెహంగా ధరించగా, వరుడు అర్జున్‌ తెల్లటి షేర్వాణీలో మెరిసిపోయాడు. వారి వివాహ వేడుకలు ఫిబ్రవరి 7న హల్దీ, మెహందీ, సంగీత్‌ వేడుకలతో ప్రారంభమయ్యాయి.

అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ వేడుకలో ఆమె తల్లి స్మృతి కూడా బంగారు అంచుతో కూడిన ఎరుపు రంగ చీరతో కనిపించారు. ఈ సందర్భంగా ఆ వధువరులిద్దరూ భార్యభర్తల్లా కలసి నటించిన తొలి చిత్రాలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి.  

(చదవండి: పాపం!.. ఆ మంత్రి దురదకు తాళలేక నడిరోడ్డు మీద కుర్తా తీసి..)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు