వీడియో వైరల్‌: విమానమెక్కిన పాము.. హడలెత్తిన ప్రయాణికులు

9 Aug, 2021 12:58 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని  కోల్‌కతాలోని ఎయిర్‌పోర్టులో ఓ పాము జనాలను హడలెత్తించింది. ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించిన పాము విమానంలోకి కూడా చొరబడి సిబ్బందిని భయాందోళనకు గురిచేసింది.  రాయ్‌పూర్‌ నుంచి ముంబై వెళ్లాల్సిన విమానం కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. అక్కడి నుంచి ముంబైకు బయల్దేరే ముందు విమానంలో పాము కనిపించింది. సామాన్లు ఉంచే బెల్ట్‌ చుట్టూ పాము చుట్టుకొని ఉంది. అయితే అదృష్టవశాత్తు అప్పటికీ ఇంకా ఎక్కువమంది ప్రయాణికులు విమానం ఎక్కలేదు.  పామును గుర్తించిన సిబ్బంది వెంటనే ఆ ప్రాంతాన్ని క్లియర్‌ చేసి అధికారులకు సమాచారం ఇచ్చారు.

అనంతరం అటవీశాఖ అధికారులను పిలిచింది పామును పట్టుకొని తీసుకెళ్లారు. ఎయిర్‌పోర్టులో పాముకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘బహుశా ఇటీవల ఇండిగో 15యానివర్సరీ కావడంతో పాము విమానం ఎక్కాలని కోరుకుందేమో.. కానీ చివరికి కోల్‌కతా అటవీశాఖ దాన్ని తీసుకెళ్లింది. ఒకసారి పాము ఎంత వేగంగా వెళుతుందో చూడండి’ అని ట్వీట్‌ చేశారు. అయితే రాయ్‌పూర్ నుంచి వచ్చిన తర్వాత విమానంలో బ్యాగేజీని ఆఫ్‌లోడ్ చేస్తున్నప్పుడు పాము విమానంలోకి ప్రవేశించిందని అధికారులు భావిస్తున్నారు. అలాగే ముంబై వెళ్లే విమానంలో ప్రయాణించాల్సిన ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి తరలించినట్లు అధికారులు తెలిపారు


 

మరిన్ని వార్తలు